Tanot Mata Temple: అంతు చిక్కని రహస్యం.. పాకిస్తాన్తో యుద్ధంలో భారత సైనికులను కాపాడిన తనోట్ మాతా ఆలయం కథ!

భారత దేశంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన హిందూ ఆలయాలు ఉన్నాయి. ప్రతీ ఆలయానికి ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ఇలాంటి ఆలయాల్లో రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైసల్మేర్‌ జిల్లాలో ఉన్న ఆలయం కూడా ఒకటి. దారి రహస్యాలు అంతుచిక్కడం లేదు.

Written By: Raj Shekar, Updated On : July 25, 2024 9:07 am

Tanot Mata Temple

Follow us on

Tanot Mata Temple: భారత్‌ వందల ఏళ్లుగా హిందూ దేశం. మన దేశాన్ని పాలించిన హిందూ రాజులు ఆలయాలు నిర్మించారు. తర్వాత ముస్లింలు దండయాత్ర చేసి హిందూ ఆలయాలను ధ్వంసం చేశారు. విలువైన సంపదను కొల్లగొట్టారు. మసీదులు నిర్మించుకున్నారు. అయితే చాలా ఆలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అలాంటి దేశాల్లో భారత దేశంలోని పశ్చిమ రాష్ట్రం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ జిల్లాలో ఉన్న దేవాలయం ఒకటి. మామాడ్జీ చరణ్‌(గాధ్వి)కుమార్తె అయిన అవద్‌ దేవతను తానోట్‌ మాతగా ఈ ఆలయంలో పూజిస్తారు. తానోట్‌ మాత కర్ణి మాతకు పూర్వీకురాలు. చరణ్‌ కులంలో జన్మించిన ఆవాద్‌ దేవతగా తానోట్‌ మాతను పూజిస్తారు. పురాతన చరణ్‌ సాహిత్యం ప్రకారం తానోట్‌ మాతను ఈ ఒక్క రూపంలోనే కాకుండా హింగ్లాజ్‌ మాతా, కర్ణిమాత రూపాలలో కూడా కొలుస్తారు. ఆమె హింగ్లాజ్‌ మాతా దేవత యొక్క స్వరూపమని నమ్ముతారు. ఇంతటి పురాతన ఆలయం కలిగిన తానోట్‌ గ్రామం ఒక వైపున మన దాయాది దేశం పాకిస్తాన్‌ సరిహద్దులకు అతి చేరువలో ఉంది. మరో వైపు 1971 నాటి భారత్‌–పాకిస్తాన్‌ యుద్ధం జరిగిన లోంగెవాలా అనే ప్రదేశానికి కూడా చాలా దగ్గరగా ఉంది. అయితే ఈ ఆలయ చరిత్రలో ఎన్నో గాథలు ఉన్నాయి. ఇక ఈ ఆలయాన్ని, అదే విధంగా ఇండో–పాక్‌ సరిహద్దును చూడాలనుకునే పర్యటకులు దీనికి సంబంధించిన పత్రాలను జిల్లా, సైనిక అధికారుల నుంచి ముందుగానే పొందాలి. ఇది ఇప్పుడు భారతదేశంలో పర్యాటక కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలో చమురు, గ్యాస్‌ నిల్వలు ఉన్నాయని చెబుతారు.

Also Read: రూట్‌ మార్చిన ఫేస్‌బుక్‌.. మళ్లీ ట్రంప్‌ భజన.. జూకర్‌బర్గ్‌ ఏంటయ్యా ఇదీ

సైన్యానికి అండగా అమ్మ..
1965 ఇండో–పాక్‌ యుద్ధం సమయంలో పాకిస్తానీ సైన్యం తానోట్‌ మాత ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ ప్రాంతం మీద 3 వేల బాంబులు పేల్చింది. కానీ అమ్మవారి మహినావ్విత శక్తుల కారణంగా ఆలయానికి ఎటువంటి నష్టం జరగలేదు. ఇక భారత సైనికులకు కూడా అమ్మవారి అండగా నిలిచారు. ప్రాణ నష్టం జరుగకుండా కాపాడారు. ఇక మన సైనికులు ఆలయం ఉన్న గ్రామంలోని మట్టినే వీరతిలకంగా పెట్టుకుని యుద్ధరంగంలోకి వెళ్లేవారు. పాకిస్తాన్‌ ట్యాంకులు భారతదేశంపై దాడి చేస్తున్న సమయంలో వారి ట్యాంకులు ఇరుక్కుపోయాయి. కదలలేకపోయాయి. తరువాత భారత వైమానిక దళం పాకిస్తాన్‌లో చిక్కుకుపోయిన ట్యాంక్‌ దళాలను కనుగొని లక్ష్యంగా చేసుకుంది, వారి వందలాది మంది సైనికులు ఈ విధంగా మరణించారు. ప్రజలు, సైనికులు ఆ ట్యాంకులు నిలిచిపోవడానికి కారణం ఆలయ పవిత్రత అని నమ్మారు. ఈ విషయం తెలుసుకున్న పాకిస్తానీ జనరల్‌ ఆలయాన్ని రక్షించిన శక్తిని చూసి దాని గురించి తెలుసుకొనుటకు భారతదేశానికి వచ్చారు. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ యుద్ధం అనంతరం ఆలయ నిర్వహణ భారతీయ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి ఆలయాల రక్షణను బీఎస్‌ఎఫ్‌ సైనికులు నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఆలయంపైన వేసిన 3 వేల బాంబుల్లో పేలని బాంబులను సేకరించి అక్కడి మ్యూజియంలో భద్రపరిచారు.

ఈ ఆలయానికి ఇలా వెళ్లాలి..
తానోట్‌ మాతా ఆలయం జైసల్మేర్‌ నగరం నుంచి 153 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జైసల్మేర్‌ నుంచి ఆలయానికి చేరుకోవడానికి రెండు గంటల సమయం పడుతుంది. ఇక ఈ ఆలయ సందర్శనకు ఏడాదిలో కేవలం మూడు నెలలు మాత్రమే అనుమతిస్తారు. అక్కడ ఉష్ణోగ్రతలు అత్యధికంగా లేని నవంబర్‌ నుంచి జనవరి వరకు మాత్రమే సందర్శకులను అనుమతిస్తారు. జైసల్మేర్‌ నుంచి ట్యాక్సీలో తానోట్‌ మాతా ఆలయానికి వెళ్లొచ్చు.

Also Read: చందమామపై నీటి జాడలు.. గుర్తించిన చైనా.. అన్నీ అనుకూలిస్తే త్వరలోనే జాబిల్లి టూర్‌!