Pakistan: భారత్–ఆఫ్గానిస్తాన్ ఈ మధ్యకాలంలో దగ్గరవుతున్నాయి. భారత్ చేస్తున్న సాయంతో ఆఫ్గాన్ పాలకులు భారత్‌కు తగిన సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈమేరకు ఇటీవల పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, వాణిజ్య మంత్రి భారత్‌లో పర్యటించారు. దీనిని మొదటి నుంచి తమ మిత్రదేశంగా భావించిన పాకిస్తాన్ జీర్ణించుకోవడం లేదు. దీంతో తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) ఉగ్రవాద సంస్థ తమ దేశంలో అల్లర్లు సృష్టిస్తోందని ఆఫ్గాన్‌పై వైమానిక దాడులు చేస్తోంది. ఆఫ్గాన్ మంత్రులు భారత్‌కు వచ్చిన సమయంలోనే ఈ దాడులు చేస్తోంది. దీంతో ఆఫ్గాన్ పాలకులు కూడా పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు.
ఖైబర్ ఫక్తుంక్వాలో దాడులు..
ఖైబర్ పక్తుంఖ్వా ప్రాంతంలో తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్తాన్,ఆఫ్గానిస్తాన్ తాలిబాన్ దాడులు తీవ్రతరమవుతున్నాయి. ఈ దాడులను అక్కడి పోలీసులు, భద్రతా దళాలు, సైనికులు తట్టుకోలేకపోతున్నారు. ఈ దాడులను తాము తట్టుకోలేమని గడిచిన ఆరు నెలల్లో 24 వేల మంది పోలీసులు, ఫ్రంటియర్ కార్ప్స్, పాక్ ఆర్మీ సిబ్బంది ఉద్యోగాలు వదులుకున్నారు. భయం, అసాధ్యత కారణంగా ఈ మాస్ ఎగ్జిట్ జరిగింది.
తాలిబాన్ దాడుల తీవ్రత
టీటీపీ, ఆఫ్గాన్ తాలిబాన్ సైనిక, పోలీస్ బలగాలపై వరుస దాడులు చేస్తున్నాయి. ఈ దాడులు భద్రతా దళాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. యోధులు ‘పోరాట సామర్థ్యం లేదు‘ అని చెప్పి వెనక్కి తగ్గారు. కొందరు కోర్ట్ మార్షల్‌కు సిద్ధంగా ఉండి కూడా ఉద్యోగాలు వదులుకున్నారు.
సైనికులు ‘బతికి ఉంటే బలుసు తిని పోతాము‘ అనే మనస్తత్వంలోకి వచ్చారు. ఆఫీసర్ల బలవంతపు ప్రయత్నాలు వథా అయ్యాయి, భద్రతా వ్యవస్థలో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఈ పరిస్థితి పాకిస్తాన్ స్థిరత్వాన్ని ముప్పుపెడుతోంది.