Raj Pakala: తెలంగాణలో డ్రగ్స్ అనగానే అందరికీ కేటీఆర్ గుర్తుకు వచ్చేలా విపక్షాలు ఆయనపై తీవ్రమైనా రోపణలు చేశాయి. ఓ సినీనటితో కలిసి డ్రగ్స్ కేసులో పట్టుబడినట్లు ఆరోపణలు చేశాయి. ఈ ఆరోపణలను కేటీఆర్ కండించారు. విమర్శల దాడి తట్టుకోలేక ఆయన కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. కానీ, అప్పటికే జనాల్లో కేటీఆర్‌పై డ్రగ్స్ ముద్ర పడిపోయింది. ఇప్పటికీ కాంగ్రెస్, బీజేపీ నేతలు కేటీఆర్‌పై గ్రడ్స్ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేసు మాయం చేశాడని పేర్కొంటారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఆయన బావ మరిది రాజ్ పాకాల.. రేవ్ పార్టీలో రెండ్ హ్యాండెడ్‌గా పట్టుబడి బావను ఇరికించేశాడు. విపక్షాలకు ఆయుధం ఇచ్చేశాడు.
ఏం జరిగిందంటే..
జన్వాడలోని ఓ ఫామ్ హౌస్‌లో శనివారం రాత్రి రేవ్ పార్టీ నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావ మరిది రాజ్‌పాల్ రెండ్ హ్యాండెడ్‌గా పట్టుపడ్డాడు. వీఐపీల రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఫారిన్ లిక్కర్, డ్రగ్స్ సీజ్ చేశారు. రేవ్ పార్టీలో క్యాసినో కూడా ఆడినట్లు సమాచారం. క్యాసినోకు సంబంధించిన మెటీరియల్ ఫామ్‌హౌస్‌లో పట్టుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకుని డ్రగ్ టెస్ట్ చేయగా కొకైన్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. పార్టీలో 42 మంది పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
సుద్దపూసలా మాటలు..
ఇదిలా ఉంటే రేవ్ పార్టీలో కేటీఆర్ బావ మరిది పట్టుబడడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. పార్టీ జరిగిణ ఫామ్‌హౌస్ ఎవరిది, అందులో ఎవరెవరు పాల్గొన్నారో తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలని పేర్కొన్నారు. ఇంతకాలం సుద్ద పూసలా మాట్లాడిన కేటీఆర్ ఇప్పుడు ఏమంటారని ప్రశ్నించారు. సమాజాన్ని భ్రష్టు పట్టించే డ్రగ్స్‌పై రాజీ ధోరణి సరికాదన్నారు.
స్పందించని కేటీఆర్..
ఇదిలా ఉంటే తన బావ మరిది డ్రగ్స్ కేసులో పట్టుబడడంపై కేటీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఈ విసయాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అందరిపై పరువు నష్టం కేసులు వేస్తూ తనను కాపాడుకుంటున్న కేటీఆర్.. ఇప్పుడు ఏమంటారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.