https://oktelugu.com/

China : పాపిష్టి చైనా వల్ల.. ప్రపంచమే ముప్పు ముంగిట ఉంది.. ఇంతకీ ఏం చేసిందంటే..

మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం.. చైనా తన ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తుందని.. ఎంతకైనా తెగిస్తుందని.. చివరికి ప్రపంచాన్ని కూడా ఇబ్బంది పెడుతుందని.. కరోనా తర్వాత ప్రపంచం మొత్తం చైనా ను దోషిగా చూసింది. అయినప్పటికీ చైనా పట్టించుకోలేదు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 25, 2024 6:02 pm
    China's Three Gorges Dam

    China's Three Gorges Dam

    Follow us on

    China : చైనా కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అతి పెద్దదైన స్త్రీ గోర్జెస్ డ్యామ్ నిర్మించింది. యాంగ్జి నది మీద 2.33 కిలోమీటర్ల పొడవు, 181 మీటర్లైతులో ఈ డ్యామ్ నిర్వహించింది. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ నదిలో నీరు ఎక్కువగా నిల్వ ఉంటున్నది. ఈ నీటి ద్వారా పంట పొలాలకు సాగునీరు అందిస్తోంది. కొన్ని ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేస్తోంది. జల విద్యుత్ కూడా తయారుచేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా చైనా ప్రయోజనాలు పొందుతుంటే.. ప్రపంచం మాత్రం ముప్పు ముంగిట ఉంది. ఈ డ్యామ్ నిర్మించిన తర్వాత భూ పరిభ్రమణ వేగం 0.06 సెకండ్లకు తగ్గిపోయిందని అప్పట్లోనే శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది మాత్రమే కాకుండా భూమి సూర్యుడి నుంచి రెండు సెంటీమీటర్ల దూరం జరిగిందని వెల్లడించారు. అయితే ఆ ప్రభావం రోజురోజుకు పెరుగుతోందట. దీంతో శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ” భూమిపై పరిమితికి మించి ఏదైనా మార్పు జరిగితే.. అది భూమి గమనంపై బావని చూపిస్తుంది.. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. 2004లో హిందూ మహాసముద్రంలో భారీ భూకంపం వచ్చింది. ఆ ప్రభావం భూమి గమనంపై స్పష్టంగా కనిపించింది. ఆ ప్రభావం వల్ల రోజు లో 2.68 మైక్రో సెకండ్ల సమయం తగ్గిపోయింది. అయితే దీనంతటికీ త్రీ గోర్జెస్ డ్యాం కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    మూడు నదుల నుంచి నీరు

    త్రీ గోర్జెస్ ప్రాజెక్టు కు మూడు నదుల నుంచి నీరు వస్తుంది. ఈ ప్రాజెక్టులో 10 ట్రిలియన్ గ్యాలన్ల నీరు నిల్వ ఉంటుంది. అంత నీరు నిల్వ ఉండడం వల్ల భూమిపై ప్రభావం చూపిస్తోంది. అంతరిక్షం నుంచి చూస్తే సాధారణ కంటికి కనిపించే అతి తక్కువ నిర్మాణాలలో త్రీ గోర్జెస్ కూడా ఒకటి. దీని ద్వారా 22,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ప్రపంచంలో మూడు అణు విద్యుత్ కేంద్రాల ఉత్పత్తికి ఇది సమానం.. ఈ డ్యామ్ లో నీరు నిల్వ ఉంచడం వల్ల భూమి అడుగున ఒత్తిడి పెరుగుతోంది.. అందువల్ల భూకంపాలు ఏర్పడే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును 1994లో ప్రారంభించారు.. 2006లో పూర్తి చేశారు. ఈ డ్యాం నిర్మాణం కోసం 114 పట్టణాలను చైనా కాలగర్భంలో కలిపింది. 1,680 గ్రామాలను సమూలంగా నాశనం చేసింది. సుమారు 14 లక్షల మందికి వేరేచోట పునరావాసం కల్పించింది. అయితే యాంగ్జి నదికి ప్రతి ఏటా భారీగా వరదలు వస్తూ ఉంటాయి. దీనివల్ల లక్షల మంది నిరాశ్రయులు అవుతుంటారు. ఒకవేళ వరద పెరిగి భారీగా నీరు చేరితే అంతే మొత్తంలో కిందికి వదులుతారు. అప్పుడు కూడా నష్టం తప్పదు. ఒకవేళ వర్షాల వల్ల భారీగా వరద నీరు చేరితే మాత్రం.. ప్రాజెక్టు ప్రమాదంలో పడితే మాత్రం.. సగం చైనా నాశనం అవుతుంది. దిగువన ఉన్న ప్రాంతాలు మొత్తం నీట మునిగిపోతాయి. అయితే ఈ ప్రాజెక్టు నిర్మించిన తర్వాత భారీగా వర్షాలు కురిసినప్పటికీ.. చైనా ముందుగానే జాగ్రత్త పడింది. ఎప్పటి నీటిని అప్పుడే కిందికి వదలడం మొదలుపెట్టింది. అందువల్ల ప్రాజెక్టు కు ఇంతవరకు ఏమీ కాలేదు.