Homeఅంతర్జాతీయంKim Jong Un China: ఉత్తరకొరియా కిమ్ తాకిన ప్రతీ చోట తుడిచేశారు..చైనాలో వింత ధోరణి

Kim Jong Un China: ఉత్తరకొరియా కిమ్ తాకిన ప్రతీ చోట తుడిచేశారు..చైనాలో వింత ధోరణి

Kim Jong Un China: ఉత్తరకొరియా నియంతగా.. యుద్ధ పిపాసిగా.. కిమ్ ప్రపంచానికి సుపరిచితుడే. ప్రజలను అష్ట కష్టాలు పెట్టి.. తనదైన నియంతృత్వాన్ని ప్రదర్శిస్తూ.. బాంబుల మీద మాత్రమే దృష్టి సారిస్తూ.. అమెరికా లాంటి దేశాల ఆంక్షలు ఎదుర్కొంటూ.. నిత్యం వార్తలోనే ఉంటాడు కిమ్. ఉత్తరకొరియా లో ప్రజాస్వామ్యం అనేది ఉండదు. కమ్యూనిస్ట్ దేశం కాబట్టి అక్కడ కిమ్ కుటుంబానిదే పెత్తనం. పైగా కిమ్ ది విపరీతమైన మనస్తత్వం. ఏ సమయానికి ఎలా ఉంటాడో.. ఎలా ప్రవర్తిస్తాడో ఎవరికీ అంతుపట్టదు. అక్కడ అతడు చెప్పిందే వేదం. అతని మాట శాసనం. అతని హెయిర్ స్టైల్ నే ప్రజలు అనుసరించాలి. అతడు చెప్పిన తిండే తినాలి. కాదని ఎవరైనా అతిక్రమిస్తే వారికి జైలు శిక్ష లేదా మరణ దండన విధిస్తాడు కిమ్.

Also Read: కవిత వ్యాఖ్యలు.. రేవంత్ చెప్పిన పాముల కథ..మామూలు పంచ్ కాదు ఇది

వార్తల్లో నిలిచాడు

నిత్యం వార్తలలో నిలవడం కిమ్ కు కొత్త కాదు. తాజాగా గ్లోబల్ మీడియాలో కిమ్ గురించి విపరీతంగా ప్రస్తావన వస్తోంది. దానికి కారణం అతడి వ్యక్తిగత భద్రత సిబ్బంది వ్యవహరించిన తీరు. ఇటీవల కాలంలో కిమ్ ఆరోగ్యం బాగోలేదని వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఉత్తర కొరియా మీడియా ఖండించింది. గిట్టని శక్తులు చేస్తున్న ప్రచారమని మండిపడింది. కిమ్ ఆరోగ్యంగా ఉన్నారని.. అద్భుతంగా ఉన్నారని పేర్కొంది. చైనా విక్టరీ పరేడ్ డే సందర్భంగా కిమ్ కు ఆహ్వానం అందింది. దీంతో ఆయన తన వ్యక్తిగత భద్రత సిబ్బందితో కలిసి చైనా వెళ్ళిపోయారు. ఈ క్రమంలో అక్కడ రష్యాధిపతి పుతిన్, కిమ్ భేటీ అయ్యారు.

రెండు దేశాలకు సంబంధించిన వాణిజ్యం.. ఇతర వ్యవహారాల గురించి చర్చలు జరిగాయి. ఇటీవల ఉక్రెయిన్ తో యుద్ధం జరుగుతున్నప్పుడు ఉత్తరకొరియా తన సైనికులను రష్యాకు పంపించింది. అప్పటినుంచి ఈ రెండు దేశాల అధిపతుల మధ్య సంబంధాలు బలపడ్డాయి. రెండు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు సాగుతున్నాయి. చైనా వేదికగా జరిగిన భేటీలో కిమ్, పోతిన్ అనేక విషయాలు మాట్లాడుకున్నారు. సమావేశం పూర్తయిన తర్వాత కిమ్ కూర్చున్న కుర్చీని ఆయన సిబ్బంది క్షుణ్ణంగా శుభ్రం చేశారు. ఆయన తాకిన ప్రదేశాలలో ఎటువంటి ఆధారాలు లేకుండా తుడిచివేశారు. కిమ్ నీటి గ్లాస్ ను కూడా మహిళా సిబ్బంది తీసుకెళ్లారు. కిమ్ డిఎన్ఏ ఇతరులకు చిక్క కూడదనే ఇలా చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడుతో రష్యా అధిపతి భేటీ అయ్యారు. చివరికి పుతిన్ వ్యర్ధాలను కూడా ఆయన సిబ్బంది వెంట తీసుకెళ్లారు. ఇప్పుడు కిమ్ వ్యక్తిగత సిబ్బంది కూడా అలానే చేయడంతో.. ఏదో జరుగుతోందనే అనుమానం వ్యక్తం అవుతుంది. పైకి మాత్రం నార్త్ కొరియా మీడియా మాత్రం అంతా బాగానే ఉందని చెబుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version