America: అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పుల మోత.. పది మందికి గాయాలు!

కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు కారణాలు ఆరా తీస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : June 16, 2024 11:25 am

America

Follow us on

America: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. మిచిగాన్‌లోని ఓ చిల్డ్రన్స్‌ వాటర్‌ పార్కు వద్ద శనివారం(జూన్‌ 15)న గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో అక్కడున్న 8 ఏల్ల చిన్నారితో సహా 10 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

పోలీసుల అదుపులో దుండగుడు..
కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు కారణాలు ఆరా తీస్తున్నారు.

బైక్‌పై వచ్చి కాల్పులు..
శనివారం సాయంత్రం 5 గంటలకు చిల్డ్రన్స్‌ పార్కు వద్దకు గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి ఒక్కసారిగా కాల్పులు జరిపినట్లు మిషిగాన్‌ పోలీసులు తెలిపారు. పలుసార్లు అగంతకుడు గన్‌లోడ్‌ చేసుకుని మరీ 28 సార్లు కాల్పులు జరిపినట్లు తెలిపారు. అయితే అతను కాల్పులు ఎందుకు జరిపాడనేది తెలియం లేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలే ఓహియో నైట్‌ క్లబ్‌లో జరిగిన కార్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వరుస కాల్పుల ఘటనలు అమెరికాలో చర్చనీయాంశమయ్యాయి.