https://oktelugu.com/

Philippines: ఈ నేరగాళ్లు మామూలోళ్లు కాదు.. కేసుల నుంచి తప్పించుకోవడానికి ఎంతకు తెగించారంటే?

Philippines: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా దక్షిణ ప్రాంతం శివారులోని పాసే అనే ఓ పట్టణం ఉంది. ఈ పట్టణంలో గత మే నెలలో పోలీసులు ఓ భవనంలో తనిఖీలు చేశారు. అక్కడ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ టూల్స్, డెంటల్ ఇంప్లాంట్స్, స్కిన్ వైటనింగ్ ఐవీ డ్రిప్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 10, 2024 / 05:37 PM IST

    The secret hospitals offering criminals new faces

    Follow us on

    Philippines: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి.. అడ్డగోలుగా సంపాదించి.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నేరగాళ్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారు. దర్జాగా పెద్ద మనుషుల్లాగా సమాజంలో చలామణి అవుతుంటారు. ఇలాంటి దృశ్యాలను మనం సినిమాలో చూస్తుంటాం. కానీ ఇవి నిజ జీవితంలో జరిగితే ఎలా ఉంటుంది? మనదేశంలో తెలియదు గాని ఫిలిప్పీన్స్ లో మాత్రం తీవ్రమైన నేరాలకు పాల్పడినవారు.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు.. నేరగాళ్లకు ప్లాస్టిక్ సర్జరీలు చేసేందుకు కొంతమంది వైద్యులు ఏకంగా అక్రమంగా ఆసుపత్రులను నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఆస్పత్రులకు ఎటువంటి అనుమతులు లేకపోవడంతో.. ఫిలిప్పీన్స్ అధికారులు వాటిని మూసి వేయించేందుకు అడుగులు వేస్తున్నారు.

    ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా దక్షిణ ప్రాంతం శివారులోని పాసే అనే ఓ పట్టణం ఉంది. ఈ పట్టణంలో గత మే నెలలో పోలీసులు ఓ భవనంలో తనిఖీలు చేశారు. అక్కడ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ టూల్స్, డెంటల్ ఇంప్లాంట్స్, స్కిన్ వైటనింగ్ ఐవీ డ్రిప్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఒక మనిషి రూపురేఖలను వీటి సహాయంతో కచ్చితంగా మార్చేయవచ్చు. అయితే ఆ భవనంలో ఉన్న ముగ్గురు డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ఇద్దరు డాక్టర్లు వియత్నాం దేశానికి చెందినవారు. మరొకరు చైనా వాసి. వాస్తవానికి అక్కడ పని చేసేందుకు వారికి ఎటువంటి అనుమతులు లేవు. ఇదేగాక మరో రెండు భవనాలలో.. ఇలాగే అక్రమ ఆసుపత్రులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ ఆసుపత్రిలో పాసే పట్టణంలోని భవనం కంటే నాలుగు రెట్లు పెద్దవని పోలీసులు చెబుతున్నారు. “ఈ ఆసుపత్రులకు అనుమతులు లేవు. ఇక్కడికి వచ్చే పేషెంట్లకు ఎటువంటి గుర్తింపు కార్డులు ఉండవు. చాలామంది ఆన్ లైన్ ద్వారా కేసినోలు ఆడి.. తర్వాత ఇక్కడకు చేరుకుంటున్నారు. ఫిలిప్పీన్స్ లో అక్రమంగా పని చేసేవారు ఇక్కడికి వస్తున్నారు. 2022లో చైనాలో ఓ మాఫియాను రన్ చేసిన ఓ వ్యక్తి ఫిలిప్పీన్స్ లో అరెస్టు అయ్యారు. అతడు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడని” ఫిలిప్పీన్స్ పోలీసులు చెబుతున్నారు.

    ఫిలిప్పీన్స్ లో ఆన్ లైన్ కేసినోలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చైనాలోని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులకు సేవలు అందిస్తుంటాయి. చైనా దేశంలో గ్యాం**** అనేది నేరం. అందువల్ల ఇక్కడ అక్రమంగా ఏర్పాటు చేసిన సంస్థలు టెలిఫోన్ స్కామ్ లు, మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల రవాణా, అక్రమంగా వాటి సరఫరా వంటి కార్యకలాపాలకు పాల్పడుతుంటాయి. ఫిలిప్పీన్స్ లో గతంలో ఉన్న ప్రభుత్వం ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చింది. అదే ప్రస్తుతం మార్కోస్ జూనియర్ అధికారులకు వచ్చిన తర్వాత వీటిపై ఉక్కు పాదం మోపుతున్నారు. ఫిలిప్పీన్స్ దేశానికి మంచి పేరు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే పోలీసులకు విస్తృత అధికారాలు ఇచ్చారు. సోదాలు, తనిఖీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.