https://oktelugu.com/

Actress: చిన్ననాటి ఫొటోలో ఎంతో అందంగా చూడముచ్చటగా ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టగలరా…ఒకే ఒక ఇంటర్వ్యూ తో బాగా ఫేమస్…

Actress: ఈ ఫోటో చూస్తే ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు ఉందే అనిపిస్తుంది కానీ గెస్ చేయడానికి కొంచెం కష్టంగానే ఉందని చెప్పచ్చు.ఈమె ఒకే ఒక ఇంటర్వ్యూ తో రాత్రికి రాత్రే స్టార్ గా మారిపోయింది.బుల్లితెర పై యాంకర్ గా అలాగే క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణించింది

Written By:
  • Srinivas
  • , Updated On : July 10, 2024 / 05:56 PM IST

    Ariyana Glory childhood pic goes viral

    Follow us on

    సామజిక మాధ్యమాలలో ప్రతి రోజు ఏదో ఒక సెలెబ్రేటికి సంబంధించిన రేర్ ఫోటోలు కానీ చిన్ననాటి ఫోటోలు కానీ వైరల్ అవుతూ ఉంటాయి.ఆ వైరల్ అయ్యిన ఫోటోలలో ఉన్నది ఎవరు అని కొంత మంది ఇట్టే గెస్ చేసేస్తారు.అయితే కొన్ని కొన్ని సార్లు ఆ ఫొటోలో ఉన్నది ఎవరు అనేది కనిపెట్టలేనంత కష్టంగా ఉంటుంది.ప్రస్తుతం ఇదే క్రమంలో ఒక వయ్యారి చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.

    ఈ ఫోటో చూస్తే ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు ఉందే అనిపిస్తుంది కానీ గెస్ చేయడానికి కొంచెం కష్టంగానే ఉందని చెప్పచ్చు.ఈమె ఒకే ఒక ఇంటర్వ్యూ తో రాత్రికి రాత్రే స్టార్ గా మారిపోయింది.బుల్లితెర పై యాంకర్ గా అలాగే క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణించింది ఈ అమ్మడు.ఇక ఆ తర్వాత బుల్లితెర మీద ప్రసారం అయ్యే రియాలిటీ షో బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి సెలెబ్రెటీగా మారిపోయింది.సోషల్ మీడియాలో ఈమె ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.

    అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.మీరు ఊహించింది కరెక్టే ఈమె గ్లామరస్ బ్యూటీ అరియానా గ్లోరీ.ప్రస్తుతం నెట్టింట్లో అరియానా చిన్ననాటి ఫోటో ఒకటి బాగా వైరల్ అవుతుంది.ఈ ఫోటో చూసి నెటిజన్లు చిన్ననాటి ఫొటోలో అరియానా చాలా అందంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఈమె అసలు పేరు మంగలి అర్చన.ఈమె 2015 ఒక యూట్యూబ్ ఛానల్ లో యాంకర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసింది.ఈ క్రమంలోనే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ను ఇంటర్వ్యూ చేసి బాగా పాపులర్ అయ్యింది.

    ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొని మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.ఈ షో తర్వాత అరియానా కు యాంకర్ గా పలు టీవీ షోస్ అవకాశాలు క్యూ కట్టాయి.ఇంస్టాగ్రామ్ లో అరియానా గ్లోరీ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.ప్రస్తుతం అరియానా కు సంబంధించిన కొన్ని గ్లామరస్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.