Bhutan : అది భూటాన్.. హిమాలయ పర్వతాలకు దగ్గరగా ఉంటుంది. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. చుట్టుపరత ప్రాంతాలతో అత్యంత ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఆ దేశపు భాగంలో 97 శాతం భూభాగం పర్వతప్రాంతాలతో నిండి ఉంటుంది. పేదరికం, వెనుకబడిన దేశం కావడంతో భూటాన్ లో పెద్దగా అభివృద్ధి కనిపించదు. పర్యాటకమే ఆ దేశ ప్రధాన ఆదాయ వనరు. ప్రజలు బౌద్ధ మతాన్ని ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. బౌద్ధ ఆరామాలు కూడా కనిపిస్తూ ఉంటాయి.. ఈ దేశంలో పారో పేరుతో విమానాశ్రయం ఉంటుంది. ఈ విమానాశ్రయం చుట్టు 18 వేల అడుగుల ఎత్తులో హిమాలయ పర్వతాలు ఉంటాయి.. ఈ ప్రాంతం మొత్తం అత్యంత దుర్భరంగా ఉంటుంది కాబట్టి.. విమానాలను ల్యాండ్ చేయడం అత్యంత ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 50 మంది పైలట్లకు మాత్రమే విమానాలను ల్యాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది.. దీని రన్ వే పొడవు 7,431 అడుగులుగా ఉంటుంది. పైగా చిన్న విమానాలను మాత్రమే ల్యాండింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రాడార్ గైడెన్స్ లేకుండా ఈ విమానాలను నడపాల్సి ఉంటుంది. అయితే ఆ విభాగంలో తగిన శిక్షణ పొందిన పైలెట్లు చాలా అవసరం. ఇందులో ఏమాత్రం తప్పు దొర్లినా విమానం ప్రమాదానికి గురవుతుంది. పారో విమానాశ్రయంలో విమానాలను ల్యాండింగ్ చేసేందుకు అర్హత పొందిన పైలట్లు కేటగిరి – సీ పరిధిలోకి వస్తారు. పౌర విమానయాన పరిశ్రమలు వీరిని డేర్ డెవిల్స్ అని పిలుస్తారు.
అత్యంత ప్రమాదకరం
ముందుగానే చెప్పినట్టు భూటాన్ దేశంలో 97% భూభాగం పర్వతప్రాంతాలతో విస్తరించి ఉంటుంది. పారో విమానాశ్రయం సముద్రమట్టానికి 7,382 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడి వాతావరణం లో అనూహ్యంగా మార్పులు చోటు చేసుకుంటాయి. గాలి సాంద్రతలో తేడా ఉంటుంది. అందువల్ల ఇక్కడ మధ్యాహ్న సమయంలో ఇక్కడ విమానాలను నడపరు. వర్షాకాలంలో ఇక్కడ భారీ సైజులో వడగళ్లు పడుతుంటాయి. అవి విమానాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తుంటాయి. రాడార్ సిగ్నల్స్ కూడా సరిగా పనిచేయవు. అందువల్ల రాత్రి సమయాల్లో విమానాల రాకపోకలను అనుమతించరు. ఇక్కడ విమానం నడపడాలంటే స్థానిక పరిస్థితులపై అవగాహన ఉండాలి. ముఖ్యంగా చిన్న విమానాలనే నడపాలి.. ప్రపంచవ్యాప్తంగా కేవలం 50 మంది పైలట్లకు మాత్రమే ఈ ప్రాంతంలో విమానాలు నడిపేందుకు అవకాశం ఉంది. వీరు తప్ప మరెవరు విమానం నడిపినా అది ప్రమాదానికి గురికావడం ఖాయం. అందువల్లే ఇవి విమానాశ్రయాన్ని అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా చెబుతుంటారు. ఈ విమానాశ్రయం తర్వాత ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఎయిర్ పోర్ట్ లు అత్యంత ప్రమాదకరమైనవి. ఇక్కడ కూడా దుర్భరమైన పరిస్థితులు ఉంటాయి. అందువల్లే పైలెట్లు జాగ్రత్తలు వహిస్తుంటారు. పేరుపొందిన పైలెట్లు మాత్రమే విమానాలను నడుపుతారు.