https://oktelugu.com/

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగలాంటి వార్త..’హరి హర వీరమల్లు’ విడుదల తేదీ వచ్చేసింది!

పవన్ కళ్యాణ్ కి కూడా కరోనా చాలా తీవ్రంగా అటాక్ అయ్యింది, ఆయన కోలుకోవడానికి 6 నెలలకు పైగానే సమయం పట్టింది. కోలుకున్న తర్వాత ఆయన ముందుగా భీమ్లా నాయక్ చిత్రాన్ని పూర్తి చేసాడు. ఆ తర్వాత మధ్యలో 'బ్రో ది అవతార్' చిత్రాన్ని కూడా చేయాల్సి వచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 23, 2024 / 11:11 AM IST

    Hari Hara Veera Mallu

    Follow us on

    Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. 2020 వ సంవత్సరం లో ‘వకీల్ సాబ్’ చిత్రం తో పాటు, ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. అప్పట్లో ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో దూసుకెళ్లింది, అలా దూసుకెళ్తున్న సమయంలో కరోనా వచ్చింది. సినిమా షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. పవన్ కళ్యాణ్ కి కూడా కరోనా చాలా తీవ్రంగా అటాక్ అయ్యింది, ఆయన కోలుకోవడానికి 6 నెలలకు పైగానే సమయం పట్టింది. కోలుకున్న తర్వాత ఆయన ముందుగా భీమ్లా నాయక్ చిత్రాన్ని పూర్తి చేసాడు. ఆ తర్వాత మధ్యలో ‘బ్రో ది అవతార్’ చిత్రాన్ని కూడా చేయాల్సి వచ్చింది. ఆ రెండు సినిమాలతో పాటుగా రామోజీ ఫిలిం సిటీ లో 50 రోజుల పాటు ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించారు. ఆ తర్వాత సుదీర్ఘ విరామం వచ్చింది, డైరెక్టర్ క్రిష్ కూడా ఈ చిత్రం నుండి తప్పుకోవాల్సి పరిస్థితి వచ్చింది.

    ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అవ్వడం, ఈ సినిమా కోసం ఆయన అనేక సినిమాలను వదులుకోవడం వంటివి జరిగాయి. అంతే కాకుండా పవన్ కళ్యాణ్, క్రిష్ కి మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ కూడా వచ్చింది. ఇక ఆ తర్వాత ఏఎంరత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఈ సినిమా మిగిలిన భాగానికి దర్శకత్వం వహించేందుకు ముందుకు వచ్చాడు. షూటింగ్ త్వరలో మొదలు అవ్వుద్ది అనుకున్నారు కానీ, పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ అవ్వడం, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి అవ్వడంతో ఈ షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. అలా ఆలస్యం అవుతూ వచ్చిన ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు నేడు విజయవాడ లో మొదలైంది. పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్ లో ఉదయం 7 గంటల నుండి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆ మూవీ యూనిట్ అభిమానులకు ఒక శుభవార్త ని తెలియచేసింది. ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28 వ తేదీన విడుదల చేయబోతున్నట్టు ఒక సరికొత్త పోస్టర్ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసారు. దీంతో అభిమానులు ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు. వాస్తవానికి ఈ తేదీన ‘ఓజీ’ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు.

    కానీ ‘హరి హర వీరమల్లు’ చిత్రం ప్రారంభించి చాలా కాలం అయ్యింది, నిర్మాత ఏఏం రత్నం కి బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయింది. వడ్డీలు కట్టుకోలేకపోతున్నాడు. ఇలాంటి సమయం లో ముందుగా ఆయనకే డేట్స్ ఇవ్వాలని భావించి పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ ని మొదలు పెట్టాడు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా, కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన గ్లిమ్స్ వీడియో లు, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మొదటి పాట ని విడుదల చేయబోతున్నారు.