Hero Splendor : అత్యధికంగా అమ్ముడు పోతున్న బైక్ ఇదే..ఆగస్టు రిపోర్టు రిలీజ్..

హీరో, హోండా కంపెనీలు మాత్రం వీటి సేల్స్ లో ఎప్పటికీ ముందు ఉంటాయి. గతంలో ఈ రెండు కంపెనీలు ఒక్కటిగా ఉన్న సమయంలో వీటి నుంచి రిలీజ్ అయిన బండ్లు చాలా వరకు అమ్ముడుపోయాయి. ఇప్పుడు వేర్వేగా మార్కెట్లోకి తీసుకొస్తున్నా డిమాండ్ తగ్గడం లేదు. తాజాగ ఆగస్టుకు సంబంధించిన సేల్స్ రిపోర్టును బయటపెట్టారు. ఈ సందర్భం ఏ వెహికల్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసుకుందాం..

Written By: Chai Muchhata, Updated On : September 23, 2024 11:30 am

Hero Splendor

Follow us on

Hero Splendor : ఆటోమోబైల్ రంగంలో టూవీలర్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. చిన్న చిన్న అవసరాలతో పాటు సామాన్యుల నుంచి మిడిల్ క్లాస్ పీపుల్స వరకు స్కూటర్ లేదా బైక్ లు కచ్చితంగా కలిగి ఉంటారు. దీంతో టూవీలర్ అమ్మకాలు విపరీతంగా ఉంటాయి. అయితే వినియోగదారులకు అనుగుణంగా చాలా కంపెనీలు ఎన్నో వెహికల్స్ ను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. కానీ హీరో, హోండా కంపెనీలు మాత్రం వీటి సేల్స్ లో ఎప్పటికీ ముందు ఉంటాయి. గతంలో ఈ రెండు కంపెనీలు ఒక్కటిగా ఉన్న సమయంలో వీటి నుంచి రిలీజ్ అయిన బండ్లు చాలా వరకు అమ్ముడుపోయాయి. ఇప్పుడు వేర్వేగా మార్కెట్లోకి తీసుకొస్తున్నా డిమాండ్ తగ్గడం లేదు. తాజాగ ఆగస్టుకు సంబంధించిన సేల్స్ రిపోర్టును బయటపెట్టారు. ఈ సందర్భం ఏ వెహికల్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసుకుందాం..

హీరో హోండా నుంచి స్పెండర్ బైక్ అంటే కొందరు తెగ లైక్ చూస్తారు. పాత వెహికల్స్ ను కొందరు ఇప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటూ డ్రైవ్ చేస్తున్నారు. అయితే హీరో గా ప్రత్యేకంగా మారిన తరువాత కంపెనీ నుంచి స్పెండర్ బైక్ ను రిలీజ్ చేసింది. లేటేస్ట్ టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ బైక్ ను వినియోగదారులు ఆదరించారు. దీంతో దీని సేల్స్ ఆటోమేటిక్ గా పెరిగాయి. గత ఆగస్టు నెలలో దీని అమ్మకాలు 3,02,234 యూనిట్లు ఉన్నాయి. ఇదే నెల గత సంవత్సరం 2,89,930గా నమోదైంది.గత ఏడాదితో పోలిస్తే ఇది 4.49 శాతం వృద్ధి సాధించింది.

హీరో స్ప్లెండర్ తరువాత హోండా యాక్టివా రెండో స్థానాన్ని ఆక్రమించింది. హోండా యాక్టివా అన్ని వర్గాల వారికి అనుగుణంగా ఉంటుంది. ఇది స్కూటర్ వలె ఉన్నా.. అన్ని పనులకూ ఉపయోగించుకోవచ్చు. అందుకే దీనిని ఎక్కువగా కొనుగోలు చేశారు. గత నెలలో హోండా యాక్టివాను 2,27,458 మంది సొంతం చేసుకున్నారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 5.86 శాతం వృద్ధి సాధించింది. మూడో ప్లేసులో ఇదే హోండా కంపెనీకి చెందిన షైన్ నిలిచింది. ఈ బైక్ కార్యాలయాల్లో పనిచేసేవారు ఎక్కువగా కోరుకుంటున్నారు స్మూత్ డ్రైవింగ్ తో పాటు మైలేజ్ పరంగా బెస్ట్ బైక్ అని తేలింది. దీంతో గత నెలలో దీనిని 1,49,697 యూనిట్లు అమ్ముడుపోయాయి. వార్షిక పెరుగుదల 31.15 శాతంగా నమోదైంది.

హీరో, హోండా కంపెనీకి చెందిన కంపెనీలే కాకుండా బజాజ్ కంపెనీ టాప్ 10 విక్రయాల జాబితాలో చోటు చేసుకుంది. ఈ ంకపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చిన పల్సర్ ఎవర్ గ్రీన్ గా ఇప్పటికీ నిలుస్తుంది. ఇది వివిధ వేరియంట్లు మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే పల్సర్ బైక్ ను గత నెలలో 1,16,250 మంది కొనుగోలు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 28.19 శాతం వృద్ధి సాధించింది. బజాజ్ తరువాత టీవీఎస్ బైక్ లు మంచి విక్రయాలు జరుపుకున్నాయి. ఈ కంపెనీ నుంచి జుపిటర్ గతనెలలో 89,327 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇది 27.49 శాతం వృద్ధిని సాధించింది.