Thailand: పర్యాటకరంగాన్ని పునరుద్ధరించేందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వం సందర్శకుల వీసా వ్యవధిని పొడిగించింది. పర్యాటకుల, విద్యార్థులు, రిమోట్ వర్కర్లకు సంబంధించి వీసా నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది.
టూరిస్టు వీసా గడువు పెంపు..
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా టూరిస్ట్ వీసా గడువును థాయ్ ప్రభుత్వం పెంచింది. దీంతో ఇతర దేశాల నుంచి వచ్చే విద్యార్థులు, రిమోట్ వర్కర్లు, పదవీ విరమణ పొందిన వారికి సంబంధించిన వీసాలో మార్పులు చేశారు.
జూన్ నుంచి అమలు..
జూన్ నుంచి ఈ కొత్త నిబంధనలు అమలవుతాయని థాయ్‌లాండ్ ప్రతినిధి చాయ్ వాచరోంకే తెలిపారు. గతంలో థాయ్‌లాండ్ వచ్చే పర్యాటక దేశాల సంఖ్య 57 నుంచి 93 పెంచామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఆయా దేశాల పర్యాటకులు వినియోగించుకోవాలని సూచించారు. ఆన్ అరైవల్ వీసా పరిమితిని 30 రోజుల నుంచి 60 రోజులకు పెంచినట్లు వెల్లడించారు. దేశంలో ఉండాలనుకునే పదవీ విరమణ పొందిన వారికి బీమా అవసరాలను కూడా సడలించింది. గ్రాడ్యుయేషన్ తర్వాత విద్యార్థులు ఏడాదిపాటు అదనంగా ఉండే అవకాశం కల్పించింది. రిమోట్ వర్కర్ల కోసం ప్రత్యేక వీసాలు ఐదేళ్లపాటు చెట్లుబాటు అయ్యేలా నిబంధనలు మార్చారు.
5 నెలల్లో.. 14.3 లక్షల మంది పర్యాటకులు
ఇదిలా ఉండగా ఈఏడాది జనవరి నుంచి మే 26వ తేదీ వరకు థాయ్ లాండ్‌ను 14.3 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శించారు. 2024 చివరి నాటికి రికార్డుస్థాయిలో 40 మిలియన్ల విదేశీయుల రాకపోకలను లక్ష్యంగా పెట్టుకుంది. దాంతో 3.5 ట్రిలియన్ బాట్లు(రూ.7.9 లక్షల కోట్లు) ఆదాయం వస్తుందని అంచనా. 2019లో కరోనాకు ముందు రికార్డు స్థాయిలో 39.9 మిలియన్ల మంది థాయ్‌లాండ్‌ను సందర్శించారు. ఈ ఏడాది దానిని అధిగమించాలని థాయ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.