Elon Musk : ప్రపంచ కుబేరుడి కుమారుడికి ఇండియన్‌ సైటిస్టు పేరు.. ఆ సైంటిస్ట్‌ ఎవరో తెలుసా?

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌. ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ నుంచి మొదలు అనేక రంగాల్లో మస్క్‌ పెట్టుబడులు పెడుతున్నారు. వ్యాపారం చేస్తున్నారు. ఆయన పరిశీధనలన్నీ వ్యాపారం కోణంలోనే. తాజాగా అంగారకుడిపై కాలనీలు నిర్మించాలనుకుంటున్నారు.

Written By: Raj Shekar, Updated On : November 3, 2024 1:04 pm

Elon Musk

Follow us on

Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌. ఆయనకు 11 మంది సంతానం. కార్ల తయారీతోపాటు, మూడేళ్ల క్రితం సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌ను టేకోవర్‌ చేశారు. దానిని ఎక్స్‌గా మార్చారు. తర్వాత చిప్‌ రంగంలో పరిశోధనలు చేస్తున్నారు. అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. చూపులేని వారికి కళ్లు తెప్పించే పరిశోధనలూ చేస్తున్నారు. రాబోయే 30 ఏళ్లలో అంగారకుడిపై మానుషులు జీవించాలని కలలు కంటున్నారు. ఈమేరకు తన డ్రీమ్‌ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికైతే తన ప్రాజెక్టు కార్యరూపం దాలుస్తుందని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఇంతటి మస్క్‌.. తన కుమారుల్లో ఒకరికి భారత సంతతికి చెందిన అమెరికా శాస్త్రవేత్త పేరు పెట్టారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

ఏఐ సదస్సుల్లో..
గతేడాది బ్రిటన్‌లో కృత్రిమ మేధ భద్రతా సదస్సు జరిగింది. దీనికి కేంద్ర మంత్రి రాజీవ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎలాన్‌ మస్క్‌ను ఆయన కలిశారు. టెస్లా చీఫ్‌తో దిగిన ఫొటోను కేంద్ర మంత్రి ఎక్స్‌లో షేర్‌ చేశారు. ‘ఏఐ సదస్సులో భాగంగా నేను ఎవరిని కలిశానో చూడండి. కెనాడాకు చెందిన శివోన్‌ అలీసా జిలిస్‌తో కలిగిన కవలల్లోని ఒక కుమారుడి మధ్య పేరు చంద్రశేఖర్‌’గా పెట్టినట్లు ఎలాన్‌ మస్క్‌ నాతో చెప్పారు. భౌతిక శాత్రంలో నొబెల్‌ బహుమతి గెలిచిన భారత సంతతి శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్‌ పేరుతో తన కొడుకు పేరు పెట్టినట్లు మస్క్‌ తెలిపారు’అని కేంద్ర మంత్రి రాజీవ్‌ ట్వీట్‌ చేశారు. ఇక మంత్రి పేరులోనూ చంద్రశేఖర్‌ పేరు ఉండడం గమనార్హం.

11 మంది పిల్లలు..
ఇక మస్క్‌కు మొత్తం 11 మంది సంతానం. ఆయనకు కెనడాకు చెందిన శివోన్‌ జిలిస్‌తో 2016లో పరిచయం ఏర్పడింది. ఆయన స్థాపించిన న్యూరాలింక్‌ కంపెనీలో జిలిస్‌ ఉద్యోగిగా చేరారు. ఈ పరిచయం రిలేషన్‌ షిప్‌కు దారితీసింది. కొన్నేళ్లు సహజీవనం చేశారు. ఈ జంటకు 2011లో కవలలు జన్మించారు. ఈ పిల్లలకు 6స్టైడర్, అజూర్‌ అని పేర్లు పెట్టారు. కాగా మస్క్‌ తన మాజీ భార్య జస్టిన్‌ విల్సన్‌తో ఐదుగురు పిల్లలను కన్నాడు. కెనడాకు చెందిన గాయని గ్రిమ్స్‌తో ముగ్గురు పిల్లలను కన్నాడు. తర్వాత గ్రిమ్స్, ఎలాన్‌ మస్క్‌ విడిపోయారు.

నక్షత్రాలపై పరిశోధన చేసిన చంద్రశేఖర్‌..
ఇదిలా ఉంటే భారతీయ అమెరికా శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం చంద్రశేకర్‌ నక్షత్రాలపై పరిశోధన చేశారు. నక్షత్రాలు రాలిపోవడం వలన బ్లాక్‌ హోల్స్‌ ఏర్పడతాయని నిర్ధారించారు. మొదట దీనిని ఎవరూ నమ్మలేదు. కానీ, తర్వాత అందరూ చంద్రశేఖర్‌ ప్రతిపాదనతో ఏకీభవించారు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, విలియమ్‌ ఆల్ఫ్రెడ్‌ ఫౌలరేతో కలిపి భౌతిక శాస్త్రంలో 1983లో నోబెల్‌ పురస్కారం ప్రకటించారు.