https://oktelugu.com/

Prashanth Varma- Mokshajna : ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ తో చేయబోయే సినిమా సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కుతుందా..? అసలు కథేంటి..?

సినిమా ఇండస్ట్రీలో వారసుల హవాగా కొనసాగుతుంది. ప్రస్తుతం స్టార్ హీరోగా ఉన్న వాళ్లంతా వారసత్వ బ్యాగ్రౌండ్ తో వచ్చిన వాళ్లే కావడం విశేషం... అలాగే ఇక మరి కొంతమంది వారసులు కూడా సినిమా ఇండస్ట్రీకి రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇక్కడ టాలెంట్ ఉన్న వాళ్లకి మాత్రమే అవకాశాలు వస్తాయనేది వాస్తవం... ఎంత ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా టాలెంట్ ఉండి సక్సెస్ సాధిస్తేనే వాళ్లకు స్టార్ హీరో ఇమేజ్ అయితే దక్కుతుంది...

Written By:
  • Gopi
  • , Updated On : November 3, 2024 / 02:24 PM IST

    Prashanth Varma- Mokshajna

    Follow us on

    Prashanth Varma- Mokshajna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రశాంత్ వర్మ యంగ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును ప్రసాదించుకున్నాడు.ప్రస్తుతం ఈయన జై హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా హనుమాన్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతుంది. ఇక దాంతోపాటుగా బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ ను హీరోగా పెట్టి ఒక సినిమా చేయడానికి కూడా ప్రణాళికలను రూపొందించుకుంటున్నాడు. అయితే ఈ సినిమాతోనే మోక్షజ్ఞను భారీగా లాంచ్ చేయాలనే ఉద్దేశ్యంలో బాలయ్య బాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మొదటి సినిమా సూపర్ సక్సెస్ అయితే ఆ తర్వాత చేయబోయే సినిమాల మీద కూడా మంచి ఇంపాక్ట్ ఉంటుందనే ఉద్దేశ్యంతోనే బాలయ్య బాబు ప్రశాంత్ వర్మ చేత ఈ సినిమాని చేయిస్తున్నాడు. మరి మొత్తానికైతే ప్రశాంత్ వర్మ ఇప్పుడు ‘ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్’ పేరు కింద భారీ సినిమాలను చేస్తున్నాడు. ఇక దాని తరహాలోనే ఈ సినిమాను కూడా చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞతో ఒక సైన్స్ ఫిక్షన్ కి చెందిన సినిమాను చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ కథ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

    ఇండియా పాకిస్తాన్ నేపథ్యంలో సాగే ఈ కథలో పాకిస్థాన్ వాళ్ళు ఇండియాలో ఒక రోగాన్ని స్ప్రెడ్ చేస్తే దానికి సంబంధించిన వైద్యాన్ని మోక్షజ్ఞ కనుక్కొని ప్రజలను కాపాడడమే ఈ సినిమా మెయిన్ గోల్ గా తెలుస్తోంది. మరి ఈ సినిమాకు సంబంధించిన పాయింట్ ని చాలా చక్కగా డెవలప్ చేసి ఈ సినిమాలో హై ఎలివేషన్ మూమెంట్స్ ఉండేలా ప్రణాళికలను రూపొందించుకొని మరి ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకొని మోక్షజ్ఞని కూడా స్టార్ హీరోగా నిలబెట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఇద్దరికీ భారీ ఇమేజ్ వస్తుందా? బాలయ్య బాబు మోక్షజ్ఞ విషయం లో ప్రశాంత్ వర్మను బాగా నమ్ముతున్నాడు. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టే సత్తా ప్రశాంత్ వర్మ కి ఉందా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.

    ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ ప్రస్తుతం ఒక తారజువ్వలా ముందుకు దూసుకెళ్తున్నాడనే చెప్పాలి. ఎక్కడ ఏ అడ్డంకి లేకుండా ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి…