Bathukamma Celebrations: బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర పండుగ. ప్రత్యేక రాష్ట్రం సాధన ఉద్యమం నుంచే బతుకమ్మకు అంతర్జాతీయంగా ఖ్యాతి పెరిగింది. తెలంగాణలో ముఖ్యమంత్రి ఉత్తర తెలంగాణలో బతుకమ్మకు ప్రముఖస్థానం ఉంది. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో సంస్కృతిని ఆంధ్రా పాలకులు ఎలా కనుమరుగు చేస్తున్నారో తెలిపేంకు జాగృతి అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బతుకమ్మకు గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేసి సఫలీకృతమయ్యారు. తెలంగాణ సాధన తర్వాత ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో ఏటా ఉత్సవాలను అధికారికంగా ఘనంగా నిర్వహిస్తోంది. తాజాగా బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణతోపాటు, దేశ విదేశాల్లో ఉంటున్న తెలుగువారు, తెలంగాణ వారు బతుకమ్మ సంబురాలు జరుపుకుంటున్నారు.
అమెరికాలో వేడుకలు..
అమెరికాలోని క్యారీ నార్త్ కరోలినాలో అదివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితోపాటు పలువురు వేడుకల్లో పాల్గొన్నారు. సెకండ్ వరల్డ్ ఫోరమ్ ఆన్ అర్బన్ ఫారెస్ట్ అండ్ ద ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో అక్టోబర్ 16 నుంచి 20 తేదీ వరకు బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నారు. వాషింగ్టన్ డీసీలో జరుగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని ఆహ్వానించారు. వారి ఆహ్వానంతో మేయర్ విజయలక్ష్మి అమెరికా వెళ్లారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన హరిత హారం పైన మేయర్ అక్కడ ప్రసంగించనున్నారు.
నార్త్ కరోలినాలో..
ఈ పర్యటనలో భాగంగా క్యారీ నార్త్ కరోలినాలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో విజయలక్ష్మి ఆదివారం పాల్గొన్నారు. తెలంగాణలోనే బతుకమ్మ సంస్కృతి మారిపోతున్న ప్రస్తుత తరుణంలో అమెరికా తెలుగువారు మాత్రం లయబద్దంగా చప్పట్లు కొడుతూ బతుకమ్మ ఆడడం ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో కొలోరాడో కాంగ్రెస్ నేత కెన్ బుక్ కూడా పాల్గొన్నారు. అక్కడి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. మన బతుకమ్మను గౌరవిస్తూ కాళ్లకు ఉన్న షూ కూడా తొలగించి మహిళలతో కలిసి రెండు చేతులతో చప్పట్లు కొడుతూ బుకమ్మ చుట్టూ తిరుగుతూ అలరించారు.
బతుకమ్మ పాటకు అమెరికన్లు ఫిదా
బతుకమ్మ పాటకు అమెరికాలో కొలరాడో రాష్ట్ర ప్రజా ప్రతినిధి కెన్ బక్ డాన్స్ వేశారు pic.twitter.com/5X2zNnRu0H
— Telugu Scribe (@TeluguScribe) October 16, 2023
ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు..
ఇదిలా ఉంటే తెలంగాణతోపాటు, వివిధ దేశాల్లో స్థిరపడి తెలుగురవారు అక్కడ మన పండుగలను జరుపుకుంటున్నారు. ఇటీవలే గణపతి నవరాత్రి వేడుకలు జరుపుకున్నారు. ప్రస్తుతం వతుకమ్మ సంబురాల్లో మునిగి తేలుతున్నారు. పూలనే దేవతగా పూజిస్తున్నారు. అక్టోబర్ 21న యూకేలో జరిగే ఈ బతుకమ్మ వేడుకల పోస్టర్‌ను కొద్ది రోజుల క్రితం భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. భారత్ జాగృతి ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా వివిధ దేశాల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తోన్నారు. భారత్ జాగృతి యూకే యూనిట్ ఏటా మెగా బతుకమ్మ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం కూడా యూకేలో జరిగే బతుకమ్మ వేడుకలకు తెలంగాణ ఎన్నారైలు హాజరు కానున్నారు. బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పలు దేశాల్లో జరుపుకోబోయే బతుకమ్మ సంబరాలకు సంబంధించి తెలంగాణ వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.