https://oktelugu.com/

Taliban: సర్జికల్‌ స్ట్రైక్‌తో పాకిస్తాన్‌కు మూడింది.. ఇక కొంప కొల్లేరే!

భారత్‌లోకి అక్రమంగా ఉగ్రవాదులను పంపుతూ భారత్‌ నాశనం కోరుకున్న దాయాది దేశం పాకిస్తాన్‌కు ఇప్పుడు మూడింది. పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌ పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తోంది. దీంతో ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 30, 2024 / 09:19 AM IST

    Taliban(1)

    Follow us on

    Taliban: భారత్‌లోకి ఉగ్రవాదులను పంపిన పాకిస్తాన్‌కు మోదీ ప్రభుత్వం సర్జికల్‌ స్ట్రైక్‌తో బుద్ధి చెప్పింది. పాకిస్తాన్‌ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలతోపాటు కొన్ని సైనిక శిబిరాలను భారత సైన్యం ధ్వసం చేసింది. ఇక పెద్దనోట్ల రద్దుతో పాకిస్తాన్‌తోపాటు, పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు అడుక్కుతినే స్థాయికి తెచ్చింది. ప్రస్తుతం దాయాది దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. అయితే ఇప్పటికీ పాకిస్తాన్‌ తమపై భారత్‌ సర్టికల్‌ స్ట్రైక్‌ చేసిన విషయాన్ని అంగీకరించడం లేదు. అంగీకరిస్తే.. తాము ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నట్లు ఒప్పుకోవాల్సి వస్తుంది. అందుకే తమపై సర్జికల్‌ స్ట్రైక్‌ జరగలేదని బుకాయిస్తోంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్‌ ఇప్పుడు తన పొరుగు దేశమైన ఆఫ్గనిస్తాన్‌లోని ఉగ్రవాదులతో ఇబ్బంది పడుతోంది. ఆ దేశంలోని తాలిబాన్లు ఇబ్బంది పెడుతున్నారు. దీంతో పాకిస్తాన్‌ కూడా ఆఫ్ఘన్‌పై సర్టికల్‌ స్ట్రైక్‌ చేసింది. భారత్‌ను చూసే ఇది నేర్చుకుంది. ఈ దాడులతో ఆఫ్ఘన్‌లోని కొంత మంది తాలిబన్లు మృతిచెందారు. ఆఫ్ఘనిస్తాన్‌ను పాలిస్తున్నది తాలిబన్లే. అలాంటి గ్రూపులపై దాడిచేస్తే వారు ఊరుకుంటారా.. ఇప్పుడ అదే పాకిస్తాన్‌కు ఇబ్బందిగా మారింది. పాక్‌ దాడులతో ఆఫ్ఘన్‌లోని తాలిబాన్లకు కోపం వచ్చింది. వీరు ఇప్పుడు పాకిస్తాన్‌పై విరుచుకు పడుతన్నారు.

    ఉగ్రవాదులపైనే దాడని..
    ఆఫ్ఘన్‌ పాలకుల ప్రతిదాడులతో పాకిస్తాన్‌ బెంబేలెత్తిపోతోంది. మనశ్శాంతి కరువైంది. ఈ తరుణంలో తాము ఉగ్రవాదులనే టార్గెట్‌ చేశామని తాలిబన్ల జోలికి రాలేదని పాకిస్తాన్‌ బుకాయిస్తోంది. కానీ తాలిబన్లు పాకిస్తాన్‌ సంజాయషీని పట్టించుకోవడం లేదు. వారికి దేశ ప్రజలతో సంబంధం లేదు. తమ క్షేమమే ముఖ్యం దీంతో పాకిస్తాన్‌తో యుద్ధానికి సైతం సై అంటున్నారు. దీంతో పాకిస్తాన్‌ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడింది. అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్తాన్‌ ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్లు తలనొప్పిగా మారారు. ఎప్పుడు ఎక్కడ విరుచుకుపడతారో తెలియని పరిస్థితి. దీంతో తాలిబాన్లతో పాకిస్తాన్‌ యుద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అదే జరిగితే భారత్‌ను భయపెట్టానికి కూడా పాకిస్తాన్‌ వద్ద యుద్ధ విమానాలు మిగలవు అన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.