Prabhas : ఒక సినిమా ఫ్లాప్ అవ్వడం, బ్లాక్ బస్టర్ అవ్వడం లేదా సూపర్ హిట్ అవ్వడం అనేది ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది. ఒక సినిమాలో స్టార్ తారాగణం ఉన్నప్పటికీ భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విఫలమైన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు, బాక్సాఫీస్ వద్ద మంచి కంటెంట్ తో ఉన్న వచ్చి అభిమానులే లేని హీరో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఈ తరహా చిత్రాలు ప్రేక్షకులకు నచ్చడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. షారుఖ్ ఖాన్ నటించిన డుంకీ, ప్రభాస్ నటించిన సలార్‌కు సినిమాలకు గట్టి పోటీని ఇచ్చింది ఓ సినిమా. అయితే ఈ సినిమా బడ్జెట్ కంటే రెండింతలు ఎక్కువగానే సంపాదించింది. అంతే కాదు, ఈ చిత్రం 2023లో కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
ప్రభాస్, షారుఖ్ ఖాన్ ల సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో అదే రేంజ్ లో హిట్ అయింది ఆ సినిమా. ఈ సినిమా ఏకంగా షారుఖ్ ఖాన్, ప్రభాస్ సినిమాలకు సవాలు విసిరిందనే చెప్పాలి. అయితే ఈ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకునే అవకాశం కూడా లీడ్ హీరోకి దక్కలేదు. ఎందుకంటే ఓ వివాదం జైలుకి వెళ్లారు ఆ హీరో. ఈయన గురించి అందరూ మాట్లాడుకున్నారు కూడా. కానీ సినిమా వల్ల కాదు. అతని వివాదం వల్ల వైరల్ గా మారారు. అవును ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటుడు మరెవరో కాదు దర్శన్ తూగుదీప. ఇప్పుడు మీకు గుర్తు వచ్చింది సినిమా పేరు. అదేనండి కాటేరా సినిమా.
కాటేరా డిసెంబర్ 29న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ దర్శన్ ప్రధాన పాత్రలో నటించారు. పాజిటివ్ రివ్యూలు, ప్రేక్షకుల ప్రేమ ఈ సినిమా వసూళ్లను రూ.60 కోట్లకు చేర్చాయి. కాగా గ్రాస్ వసూళ్లు రూ.104.58 కోట్లు. ఈ చిత్రం 1970లలో కర్ణాటకలోని ఒక గ్రామంలో జరిగిన యదార్థ సంఘటన నుంచి ప్రేరణ పొందింది. ఈ చిత్రం కథలో దర్శన్‌తో పాటు జగపతి బాబు, కుమార్ గోవింద్, వినోద్ కుమార్ అల్వా, డానిష్ అక్తర్ సైఫీ, శృతి ఈ యాక్షన్ చిత్రంలో సహాయక పాత్రల్లో నటించారు. తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించారు.
ఈ నటుడు రేణుకాస్వామిని హత్య చేశారని ఆరోపణలతో కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత హీరో దర్శన్ టాపిక్ హైలెట్ గా నిలిచారు. అయితే నివేదికల ప్రకారం, రేణుకాస్వామి చిత్రదుర్గ నివాసి. కన్నడ నటుడు దర్శన్‌తో పనిచేసే వ్యక్తులు లేదా కిడ్నాప్ చేసి హత్య చేశారని ఆరోపించారు. నటుడు దర్శన్, పవిత్ర గౌడ, ఇతర 15 మంది నిందితులను జూన్ 11 న అరెస్టు చేశారు. ఆ అభిమాని పవిత్రకు అసభ్యకరమైన సందేశాలు పంపారట.
బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి అతని చిత్రాలు వైరల్ కావడంతో అతను మరోసారి వైరల్ అయ్యారు.ఇక ఈ కన్నడ నటుడిపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఏది ఏమైనప్పటికీ, వైద్య కారణాలపై 30 అక్టోబర్ 2024న, ప్రధానంగా వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకోవడానికి అతనికి ఆరు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు.