Ayurhman Card
Ayurhman Card: మారుతున్న జీవన శైలితో వ్యాధులు ముసురుకుంటున్నాయి. ఇదే సమయంలో వైద్యం ఖరీదు అవుతోంది. దీంతో అనారోగ్యం వస్తే ప్రైవేటుగా వైద్యం చేసుకోవాలంటే వేలు, లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అనేక బీమా సంస్థలు ఇన్సూరెన్స్ కల్పిస్తున్నాయి. అయితే పేదలకు బీమా చేసుకునే స్థోమత కూడా ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాలు, బీమా పథకాలు అమలు చేస్తున్నాయి. వీటి ప్రయోజనం పొందాలంటే నిర్ధిష్ట అర్హతలు ఉండాలి. పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు కేంద్రం ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన లేదా ఆయుష్మాన్ భారత్ యోజన స్కీం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం లబ్ధిదారులకు ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తుంది. అర్హులకు చికిత్సతోపాటు మందులు, టెస్టులు సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఫ్రీ మెడికల్ కవరేజీ ఇస్తుంది. ప్రభుత్వం, ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఈ కార్డుల ద్వారా ట్రీట్‌మెంట్ చేసుకోవచ్చు. అయితే అర్హులైన లబ్ధిదారులు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు పొందుతారు.
ఇలా దరఖాస్తు చేయాలి?
అర్మత ఉన్నవారు ఆయుష్మాన్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా అధికారిక వెబ్‌సైట్ pmjay.gov.in ఓపెన్ చేయాలి. తర్వాత లాగింన్ చేసి అవసరమైన వివరాలు ఎంటర్ చేయాలి. మీ అప్లికేషన్ సబ్‌మిట్ చేసి అప్రూవల్ కోసం వేచి ఉండాలి. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత మీ ఆయుష్మాన్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆఫ్‌లైన్ ప్రాసెస్
మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి సంబందిత అధికారిని కలిసి అప్లికేషన్ ఫాం నింపి ఇవ్వాలి. అవసరమైన డాక్యుమెంట్లు అందించాలి. అధికారి మీ అర్హత, డాక్యుమెంట్లు వెరిఫై చేస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే మీ ఆయుష్మాన్ భారత్ కార్డు జనరేట్ చేస్తారు. మీరు దానిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అర్హతలు ఇవీ..
ఆయుష్మాన్ కార్డుకు మీరు అర్హులా కాదా తెలియాలంటే.. అధికారిక పోర్టల్ pmjay.gov.in కి వెళ్లండి. యామ్ ఐ ఎలిజిబుల్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. మీ మొబైల్‌కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. వెరిఫై చేసిన తర్వాత లాగిన్ అవ్వాలి. మీరు లాగిన్ అయినప్పుడు మీకు రెండు ఆప్షన్లు వస్తాయి. మీరు మొదటి దానిలో మీ రాష్ట్రం, రెండో దానిలో జిల్లా సెలెక్ట్ చేయాలి. సెర్చ్ చేయడానికి చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఆధార్ కార్డును సెలక్ట్ చేసి మీ 12 నంబర్ల ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. వివరాలను ఎంటర్ చేసిన తర్వాత సెర్‌చ బటన్‌పై క్లిక్ చేయాలి. మీరు ఆయుష్మాన్ కార్డు పొందడాడనికి అర్హులా కాదా అని తెలుస్తుంది.
అవసరమైన డాక్యుమెంట్లు
మీరు ఆయుష్మాన్ కార్డుకు అర్హులైతే ECC 2011 డేటాలో మీ పేరు తప్పనిసరిగా ఉండాలి. BPL లేదా AAY రేషన్ కార్డును కలిగి ఉన్నవారు అర్హులు. మీ కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల్లోపు ఉండాలి. మీరు ఏ ఇతర ప్రభుత్వ పథకం కింద ఆరోగ్య బీమా కలిగి ఉండకూడదు. ఆయుష్మాన్ కార్డును పొందడానికి ఆధార్ కార్డు, రేషన్ కారు, ఓటరు ఐడీ కార్డు అవసరం. అలాగే బ్యాంకు పాస్‌బుక్, మొబైల్ నంబర్, పాస్‌పోర్టు సైజు ఫొటో ఉండాలి.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: If you have an ayurhman card you will get free treatment up to 5 lakh apply for health card like this
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com