https://oktelugu.com/

రాజస్థాన్ తో సన్ రైజర్స్ మ్యాచ్.. గెలుపెవరిదో..?

రాజస్థాన్  తో సన్ రైజర్స్ ఈ రోజు తలపడనుంది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఇప్పటి వరకు ఐపీఎల్ 2021లో ఒక్క మ్యాచ్ లో కూడా సరైన ఆట ఆడలేదు. ఇప్పటి వరకు 9 మ్యాచులు ఆడిన సన్ రైజర్స్ కేవలం ఒకే మ్యాచ్ లో విజయం సాధించింది. 2 పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఐపీఎల్ రెండో దశలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ […]

Written By: , Updated On : September 27, 2021 / 02:20 PM IST
Follow us on

రాజస్థాన్  తో సన్ రైజర్స్ ఈ రోజు తలపడనుంది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఇప్పటి వరకు ఐపీఎల్ 2021లో ఒక్క మ్యాచ్ లో కూడా సరైన ఆట ఆడలేదు. ఇప్పటి వరకు 9 మ్యాచులు ఆడిన సన్ రైజర్స్ కేవలం ఒకే మ్యాచ్ లో విజయం సాధించింది. 2 పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఐపీఎల్ రెండో దశలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ కు చేరుకోవాలంటే అద్భుతమే జరగాలి. గతంలో సన్ రైజర్స్ జట్టుకు మిడిల్ ఆర్డర్ సమస్య ఒక్కటే ఉండేది.

ఈసారి టాప్ ఆర్డర్ విఫలమవడంతో పాటు బౌలింగ్ లో పస లేకపోవడంతో వరుస ఓటములను ఎదుర్కొంటోంది. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పూర్తిగా విఫలమవుతున్నాడు. ఒక్క మ్యాచులో కూడా సరైన ప్రదర్శన చేయలేదు. దాంతో తొలి దశలో ఒక మ్యాచ్ పై వేటు పడగా.. జానీ బెయిర్ స్టో అందుబాలుో లేకపోవడంతో ఢిల్లీపై వార్నర్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచులో డకౌట్ అయ్యాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో మరో అవకాశం వచ్చింది. 3 బంతుల్లో 2 పరుగులు చేసి మరోసారి నిరాశపరిచాడు.

దాంతీ రాజస్థాన్ తో జరిగే మ్యాచులో అతడిపై వేటు పడనుంది. వార్నర్ స్థానంలో ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. వరుసగా విపలమవుతున్న కేదార్ జాదవ్ కూడా దాదాపుగా ఈ మ్యాచ్ లో ఆడే అవకాశం లేదు. బౌలరల్లో రషీద్ ఖాన్ మినహా మిగతా వారు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. నటరాజన్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.