మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ కి మంచి విష్ణుకి మధ్య పోటీ రసవత్తరంగా మారింది. మేమంటే మేము అంటూ ఇరు వర్గాలు బరిలో నిలిచాయి. పోటీ తీవ్రత దెబ్బకు ఎన్నికల హడావుడి రోజుకో మలుపు తిరుగుతూ సాగుతుంది. ఇక తాజాగా ఎన్నికల నామినేషన్ ల పర్వం మొదలయ్యే సరికి ప్రకాశ్ రాజ్ ఉత్సాహంగా ‘మా’ అధ్యక్ష అభ్యర్థిగా తన ప్యానెల్ సభ్యులతో కలిసి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు.

అయితే ఊరికే నామినేషన్ దాఖలు చేస్తే ఎవరు పట్టించుకుంటారు ? అందుకే, ప్రకాశ్‌రాజ్ నామినేషన్ వేసిన వెంటనే అవసరం లేకపోయినా మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రతి విషయంలో మేం ఒక అడుగు ముందే ఉంటూ వస్తున్నాం. అయినా ఇవి ఎన్నికలు కాదు.. పోటీ మాత్రమే. గెలిపించేది.. ఓడించేది ఓటర్లే’ అంటూ చెప్పుకొచ్చాడు. అయినా ఎన్నికలు కాదు, పోటీ అంటే ఎవరు మాత్రం నమ్ముతారు ?
ఏది ఏమైనా ప్రకాశ్ రాజ్ ‘మా’ ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దు’ అని క్లారిటీగా చెప్పడం బాగుంది. ఇక అక్టోబర్ 3న తన ఎన్నికల ప్రణాళికను వెల్లడిస్తానని ప్రకాశ్ రాజ్ చెప్పారు. అయితే ఇక్కడ ప్రకాశ్ రాజ్ పవన్ ను పొగుడుతూ మాట్లాడటం విశేషం. ‘పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడు. దేశం కోసం పోరాడుతున్నారు. మంచి నాయకుడు’ అంటూ ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చాడు.
ఈ పొగడ్తల వరకు బాగానే ఉంది. కానీ పవన్ సిద్ధాంతాలు మంచివి, పవన్ మంచి వాడు అని ప్రకాశ్ రాజ్ నమ్మినప్పుడు, గతంలో ఎందుకు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు ? ప్రకాశ్ రాజ్ కే తెలియాలి. ఇక చివర్లో ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ గురించి చెబుతూ.. ‘మా ప్యానెల్ లక్ష్యం ‘మా’ అభ్యుదయం కోసం పనిచేయడమే. రాజకీయ వ్యాఖ్యలపై దయచేసి ఎవరూ ప్రశ్నించవద్దు’’ అంటూ ప్రకాశ్ రాజ్ స్పీచ్ ను ముగించారు.
ఇక ప్రకాశ్‌రాజ్ ప్యానల్ తరుపున నామినేషన్ దాఖలు చేసిన సభ్యుల విషయానికి వస్తే..
ప్రకారాజ్ ప్యానల్ సభ్యుల లిస్ట్ వీరే.
1. ప్రకాశ్ రాజ్
2. జయసుధ
3. శ్రీకాంత్
4. బెనర్జీ
5. సాయికుమార్
6. తనీష్
7. ప్రగతి
8. అనసూయ
9. సన
10. అనిత చౌదరి
11. సుధ
12. అజయ్
13. నాగినీడు
14. బ్రహ్మాజీ
15. రవిప్రకాష్
16. సమీర్
17. ఉత్తేజ్
18. బండ్ల గణేష్
19. ఏడిద శ్రీరామ్
20. శివారెడ్డి
21. భూపాల్
22. టార్జాన్
23. సురేష్ కొండేటి
24. ఖయ్యుం
25. సుడిగాలి సుధీర్
26. గోవిందరావు
27. శ్రీధర్‌రావు
ఇక మా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా నటుడు సీవీఎల్ నర్సింహారావు కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఇక రేపు మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేయనున్నారు.