
గులాబ్ తుఫాను సహాయక చర్యలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. తుపాను అనంతర పరిస్థితులపై జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వర్షం తగ్గుముఖం పట్టాగానే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ ను పునరుద్ధరించాలి జగన్ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున సాయాన్ని వెంటనే ఇవ్వాలని బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని సీఎం స్పష్టం చేశారు.
బాధితులకు సాయం చేయడంలో వెనకడుగు కేయొద్దు, సహాయక శిబిరాల్లో అందించే ఆహారం నాణ్యంగా ఉండాలి. మంచి వైద్యం, రక్షిత తాగునీరు అందించాలి అదేశించారు. అవసరమైన అన్ని చోట్లా సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలి అన్నారు. విశాఖ నగరంలోని ముంపు ప్రాంతాల్లో వర్షపు నీటిని ప పంపింగ్ చేసి తొలగించే పనిని ముర్మరంగా చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే శ్రీకాకుళంలో ఉణ్న సీఎస్ ఆదిత్యనాథ్ ను అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించాల్సిందిగా ఆదేశించారు. జిల్లాలోని 12 మండలాల్లో 64 పురావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, 38 కేంద్రాల్లో 1514 మంది ఉన్నారని జిల్లా కలెక్టర్ సీఎం కు వివరించారు.
ఇళ్లలోని నీరు చేరి ఇబ్బందులు పడుతున్న కుటుంబాలక రూ. 1000 చొప్పున సాయం అందించాలని సీఎం ఆదేశించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా కలెక్టర్లతో సీఎం మాట్లాడారు. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన ఎన్యుమరేషన్ చేపట్టాలని ఆదేశించారు. రైతులును ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి అధికారులకు సూచించారు.