https://oktelugu.com/

Donald Trump: ఏం చేస్తారో తెలియదు.. వెంటనే యుద్ధం ఆపండి? పుతిన్‌కు ట్రంప్‌ వార్నంగ్‌!

తాను అధికారంలోకి వచ్చాక యుద్ధాలు ఆపేస్తానన్నాడు ట్రంప్‌. ఇప్పుడు అధికారం చేపట్టారు. జనవని 20 అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. వెంటనే కీలకమైన అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో జన్మతః అమెరికా పౌరసత్వం ఒకటి. ఇక ఇప్పుడు యుద్ధాలు ఆపడంపై దృష్టి పెట్టారు.

Written By: , Updated On : January 23, 2025 / 05:59 PM IST
Donald Trump

Donald Trump

Follow us on

Trump On Putin : యుద్ధాల కారణంగా అమెరికా సంపద వృథా అవుతోంది. తాను అధ్యక్షుడిగా గెలిస్తే యుద్ధాలు ఆపేస్తా.. శాంతి నెలకొల్పుతా అని అమెరికా(America)అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ పదే పదే చెప్పారు. ట్రంప్‌ గెలుపునకు ఇది కూడా దోహదపడింది. ఇప్పుడు అమెరికా 47వ అధ్యక్షుడిగా జనవరి 20న బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో యుద్ధాలు ఆపే ప్రక్రియ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా తాను రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Puthin)తో భేటీ అయ్యేందుకు సిద్ధమని ప్రకటించారు. మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగిపు పలుకుతానని పునరుద్ఘాటించారు. తాను అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్‌లో సంక్షోభం వచ్చేది కాదని పేర్కొన్నారు.

చర్చలకు రాకుంటే ఆంక్షలే..
రష్యా–ఉక్రెయిన్‌ సంక్షోభానికి త్వరలో ముగింపు పలుకుతానని ట్రంప్‌ స్పష్టం చేశారు. కీవ్‌లో శాంతి ఒప్పందంపై చర్యలు జరుపుతానని తెలిపారు. రష్యా(Russhya) చర్చలకు రాకపోతే ఆంక్షలు విధిస్తామని స్పష్టం చేశారు. మాస్కో ఎప్పుడూ ఉక్రెయిన్‌ను ఆక్రమించదని తెలిపారు. పుతిన్‌పై తనకు అవగాహన ఉందని పేర్కొన్నారు. ఆయన తెలివైన వ్యక్తని, మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ అంటే పుతిన్‌కు గౌరవం లేదని వెల్లడించారు. పుతిన్‌తో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

శాంతి ఒప్పందం జరగాలి..
యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌(Ucrain)కు ఆయుధాలు సరఫనా చేసే విషయమై సమీక్షిస్తామని ట్రంప్‌ తెలిపారు. ఈమేరకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జలెన్‌స్కీతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. శాంతి ఒప్పందం జరగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఏది ఏమైనా యుద్ధం ఆపేలా కృషి చేస్తా అని ప్రకటించారు.

పశ్చిమాసియాకు వెళ్తా..
ఇక అమెరికా అధ్యక్షుడిగా పశ్చిమాసియాకు వెళ్తనని ట్రంప్‌ తెలిపారు. బందీలు తిరిగి వస్తున్నందున ఇప్పుడే వెళ్లాలని అనుకోవడం లేదని పేర్కొన్నారు. అయితే బందీల విడుదల క్రెడిట్‌ తనకే దక్కుతుందని వెల్లడించారు. తాను అధికారంలోకి రాకుంటే బందీలు విడుదలయ్యేవారు కాదని పేర్కొన్నారు. వారంతా చనిపోయేవారన్నారు. ఇది ఏడాది ముందే జరిగి ఉంటే ఈ ఒప్పందం జరగడానికి బైడెన్‌కు ఏడాదిన్నర లేదా రెండేళ్లు పట్టేదన్నారు. ఆరు నెలల ముందు ఒప్పందం జరిగి ఉంటే ఇంత మంది చనిపోయేవారు కాదని పేర్కొన్నారు. తాను డెడ్‌లైన్‌ పెట్టినందునే ఒప్పందం జరిగిందని తెలిపారు. ఇక మధ్య ప్రాచ్యంలోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు.