Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉత్కంఠ రేపుతున్నాయి. హోరాహోరీగా పోటీ నెలకొన్నట్లు సర్వే సంస్థలు పేర్కొంటున్నాయి. గడువు సమీపిస్తుండడంతో అభ్యర్థులు ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకెళ్తున్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. హామీలు గుప్పిస్తున్నారు. అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల రేసులో ముందు వరుసలో ఉన్న డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్ మధ్య ఇటీవలే yì బేట్ కూడా జరిగింది. తొలి డిబేట్‌లో కమలా పైచేయి సాధించినట్లు మీడియా కథనాలు రాశాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌పై తాజాగా హత్యాయత్నం జరిగిందన వార్తలు సంచలనంగా మారాయి. గతంలో కూడా అతనిపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో ట్రంప్ మైలేజీ పెరిగింది. కానీ, కమలా హారిస్ రేసులోకి వచ్చాక మళ్లీ ఆయన గెలుపు అవకాశాలు తగ్గుతున్నట్లు సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హత్యాయత్నం వార్తలు కలకలం రేపుతున్నాయి. ప్రచారం కోసం.. గెలుపు అవకాశాలు పెంచుకునేందుకే ట్రంప్ ఇలా ప్రచారం చేసుకుంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గోల్ఫ్ కోర్స్ సమీపంలో కాల్పులు..
డొనాల్డ్ ట్రపంప్ ఫోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని తన గోల్ఫ్ కోర్సులో గోల్ఫ్ ఆడుతున్న క్రమంలో సమీపంలో తుపాకీ శబ్దాలు వినిపించాయని అమెరికా మీడియా తెలపింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సమీపంలో తనిఖీలు చేయగా ఓ అనుమానాస్పద వ్యక్తి కనిపించాడు. అతనిపై పోలీసులు కాల్పులు జరుపగా పారిపోయాడు. దీంతో ట్రంప్‌పై హత్యాయత్నం చేసి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై ట్రంప్ స్పందించారు. తాను క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు.
జూలై 28న హత్యాయత్నం..
అమెరికా మాజీ అధ్యక్షుడు అయిన ట్రంప్‌పై జూలై 28న పెన్సిల్వేనియాలో హత్యాయత్నం జరిగింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల నుంచి ట్రంప్ వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు. ఆ ఘటన మర్చిపోకముందే.. మళ్లీ హత్యాయత్నం జరగడం ఇప్పుడు కలకలం రేపింది. ఆదివారం మధ్యాహ్న 1:30 గంటలకు(భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 11:30 గంటలు)ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ కాల్పులు ట్రంప్ లక్ష్యంగా జరిగాయా లేదా అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఘటన స్థలంలో ఏకే47 తుపాకీ..
ఇదిలా ఉంటే.. పోలీసుల తనిఖీల్లో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపేరు ర్యాన్ వెస్లీ రోత్ అని తెలిపారు. అతడివద్ద తనిఖీ చేయగా పొదల్లో ఏకే 47 తుపాకీ దొరికందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సీక్రెట్ సర్వీస్ కూడా దర్యాప్తు చేపట్టింది. ఘటన స్థలంలో తుపాకీ బ్యారెట్ పౌడర్ ఉండడంతో ట్రంప్ లక్ష్యంగానే కాల్పులు జరిగాయని అనుమానిస్తున్నారు.
హింజకు తావులేదు..
ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై ఎన్నికల బరిలో ఉన్న ట్రంప్‌తోపాటు, కమలా హారిస్ కూడా స్పందించారు. అమెరికాలో హింసకు తావులేదన్నారు. దాడిని ఖండించారు. ట్రంప్ సురక్షితంగా ఉన్నారని తెలిసి సంతోషంగా ఉందన్నారు. కాల్పుల విషయాన్ని అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు తెలిపామని వైట్‌హౌస్ ప్రకటించింది.