Homeఅంతర్జాతీయంShehbaz Sharif Sensational Comments: పాక్‌ ప్రధాని మళ్లీ పిచ్చి కూతలు.. భారత్‌ దెబ్బ రుచి...

Shehbaz Sharif Sensational Comments: పాక్‌ ప్రధాని మళ్లీ పిచ్చి కూతలు.. భారత్‌ దెబ్బ రుచి చూసి కూడా గాంభీర్యం!

Shehbaz Sharif Sensational Comments: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి భారత్‌–పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలను మరోసారి ఉధృతం చేసింది. ఈ ఘటనను పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ ‘దురదృష్టకరం‘ అని పేర్కొన్నప్పటికీ, 1971 యుద్ధంలో ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నామని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ ఉగ్రదాడి రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని సష్టించే ప్రమాదకర పరిస్థితిని తెచ్చిపెట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని షెహబాజ్‌ షరీఫ్‌ కోరినప్పటికీ, భారత్‌ దానిని తిరస్కరించడం గమనార్హం.

ఆపరేషన్‌ సిందూర్‌..
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం మే 7న పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలపై ‘ఆపరేషన్‌ సిందూర్‌‘ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో ముజఫరాబాద్‌ సమీపంలోని ఉగ్రమూకల శిబిరాలను భారత సైన్యం నేలమట్టం చేసింది. ఈ దాడుల్లో పలువురు ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌కు సంబంధించి షెహబాజ్‌ షరీఫ్‌ మతుల కుటుంబాలను పరామర్శించి, ఆర్థిక సాయం అందజేశారు, ఇది రాజకీయంగా సునిశితమైన చర్యగా భావించబడుతోంది.

Also Read: Bangladesh : బంగ్లాదేశ్‌ రాజకీయ మళ్లీ రాజకీయ సంక్షోభం.. తాత్కాలిక అధ్యక్షుడి రాజీనామా.. !?

కాల్పుల విరమణ
ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం, మే 8 నుంచి మూడు రోజుల పాటు పాకిస్థాన్‌ సైన్యం సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడింది. ఈ కవ్వింపు చర్యలకు భారత సైన్యం దీటుగా స్పందించడంతో రెండు వైపులా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారత దాడుల్లో పాకిస్థాన్‌ సైన్యం గణనీయమైన నష్టాన్ని చవిచూసింది. చివరకు, కాల్పుల విరమణ ఒప్పందంతో సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి క్రమంగా సద్దుమణిగింది.

అంతర్జాతీయ దర్యాప్తునకు డిమాండ్‌ ..
పహల్గాం ఉగ్రదాడిపై అంతర్జాతీయ స్థాయి దర్యాప్తు జరపాలని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. అయితే, భారత్‌ ఈ ప్రతిపాదనను స్పష్టంగా తిరస్కరించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ ఎల్లప్పుడూ గట్టి వైఖరిని అవలంబిస్తుందని, అంతర్జాతీయ జోక్యం అవసరం లేదని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ ఘటన భారత్‌–పాక్‌ సంబంధాల్లో మరోసారి చీలికను స్పష్టం చేసింది.

Also Read: Harvard University : హార్వర్డ్‌ యూనివర్సిటీని పగబట్టిన ట్రంప్‌.. మరో కఠిన నిర్ణయం.. భారతీయ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం!

భవిష్యత్తు ఆందోళనలు
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్, దాని తర్వాత సరిహద్దు ఘర్షణలు రెండు దేశాల మధ్య శాంతి ప్రక్రియకు గణనీయమైన ఆటంకాన్ని కలిగించాయి. పాకిస్థాన్‌ యొక్క వివాదాస్పద వ్యాఖ్యలు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నట్లుగా కనిపించే చర్యలు భారత్‌ను మరింత గట్టి వైఖరి అవలంబించేలా చేశాయి. ఈ ఘటనలు భవిష్యత్తులో మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version