Russia Nuclear: రష్యా అణు పరీక్షలు.. న్యూక్లియర్‌ ఫోర్స్‌కు పుతిన్‌ కీలక ఆదేశాలు!

ఉక్రయిన్‌ పాశ్చాత్య దేశాల మద్దతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అణుశక్తి సామర్థ్యాన్ని పుతిన్‌ ప్రస్తావించారు. రష్యాలోని అణు ఆయుధగారం దేశ సార్వభౌమాధికారం. భద్రతకు నమ్మదగిన హామీ.

Written By: Raj Shekar, Updated On : October 30, 2024 9:55 am

Russia Nuclear

Follow us on

Russia Nuclear: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించి రెండేళ్లు దాటింది. కానీ, ఇప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఇప్పటికే రెండు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. అయినా ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. ఉక్రెయిన్‌ తలొగ్గడం లేదు. అమెరికా సహకారంతో రష్యాపై ప్రతిదాడి చేస్తోంది. ఈ తరుణంలో ఉక్రెయిన్‌ విషయంలో పశ్చిమా దేశాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యూక్లియర్‌ ఫోర్స్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు. క్షిపిణి ప్రయోగాలకు కసరత్తు ప్రారంభించాలని సూచించారు. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన బాలిస్టిక్, క్రూయిజ్‌ క్షిపుణుల ప్రయోగా పరీక్షలు నిర్వహించాలని సైనికాధికారులతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. పుతిన్‌ ఆదేశాలతో రష్యా న్యూక్లియర్‌ ఫోర్స్‌ అణు క్షిపుణుల పరీక్షలు ప్రారంభించింది.

ఒత్తిడితోనే ఈ నిర్ణయం..
ఉక్రయిన్‌ పాశ్చాత్య దేశాల మద్దతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అణుశక్తి సామర్థ్యాన్ని పుతిన్‌ ప్రస్తావించారు. రష్యాలోని అణు ఆయుధగారం దేశ సార్వభౌమాధికారం. భద్రతకు నమ్మదగిన హామీ. పెరుగుతున్న ఉద్రిక్తతలు.. భౌగోలిక రాజకీయ ఒత్తిడి. కొత్త హెచ్చరికలు, ప్రమాదాలను పరిగణనలోకి తీసుకున్న పుతిన్‌ అణు యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

బాలిస్టిక్‌ క్షిపిణి పరీక్ష..
పుతిన్‌ ఆదేశాలతో రష్యా న్యూక్లియర్‌ ఫోర్స్‌ కమ్చట్కా ద్వీపకల్పంలోని కురా టెస్టింగ్‌ రేంజ్‌లోని ప్రెసెట్స్‌కు లాంచ్‌ ప్యాడ్‌ నుంచి యార్స్‌ ఖండాతర బాలిస్టిక్‌ క్షిపిణిని పరీక్షించినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. అన్ని క్షిపుణులు తమ లక్ష్యాలను ధ్వంసం చేయాలని పేర్కొంది. గత నెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అమెరికా, నాటో మిత్ర దేశాలను హెచ్చరించారు. రష్యాపై దాడులు చేసేందుకు పాశ్చాత్య దేశాలు ఇచ్చిన లాంగ్‌ లాంగ్‌ రేంజ్‌ ఆయుధాలను ఉక్రెయిన్‌ ప్రయోగిస్తే.. రష్యాపై నాటో యుద్ధం ప్రారంభించినట్లు భావిస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో అణు పరీక్షలు చేయడం ఉద్రిక్తతలను మరింత పెంచింది.