YS Vijayamma: రచ్చకెక్కిన కూతురుకు మద్దతా? విజయమ్మకు వైసిపి కౌంటర్!

విజయమ్మ విషయంలో ఇప్పటివరకు వైసీపీ చాలా పద్ధతిగా వ్యవహరించింది. నేరుగా ఎన్నడూ విమర్శలు చేయలేదు. కానీ ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా లేఖ రాయడంతో వైసిపి తట్టుకోలేకపోతోంది.

Written By: Dharma, Updated On : October 30, 2024 9:58 am

YS Vijayamma

Follow us on

YS Vijayamma: వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది.నిన్నటి వరకు షర్మిల వర్సెస్ వైసీపీ నేతలు అన్నట్టు పరిస్థితి ఉండేది. కానీ అనూహ్యంగా విజయమ్మ లేఖ విడుదల చేశారు. దీనిపై వైసీపీ కౌంటర్ ఇచ్చింది. రచ్చకెక్కింది ఎవరమ్మా? అంటూ వైసీపీ సోషల్ మీడియా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యింది. జగన్, షర్మిల మధ్య జరుగుతున్న వివాదం పై నిన్న విజయమ్మ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఇది షర్మిలకు మద్దతుగా ఉండటం విశేషం. అందుకే ఇప్పుడు వైసీపీ విజయమ్మను టార్గెట్ చేసుకుంది. వైసిపి సోషల్ మీడియా నేరుగా విమర్శలకు దిగింది. వైయస్ షర్మిలను అమితంగా గౌరవిస్తామని.. విజయమ్మను కూడా అదే స్థాయిలో చూసుకుంటామని పేర్కొంది. జగన్ బెయిల్ రద్దు కుట్రను విజయమ్మ ప్రస్తావించక పోవడానికి పక్కదారి పట్టించడమేనని సీరియస్ అయ్యింది. షర్మిల ఒత్తిళ్లకు లొంగి ఆమె అలా వ్యవహరిస్తోందని అనుమానం వ్యక్తం చేసింది వైసీపీ సోషల్ మీడియా. షర్మిల జగన్ అన్ని విధాల నష్టం చేకూర్చేలా వ్యవహరించిందని.. జగన్ చాలా ఓపిక పట్టాడని.. అన్ని బాధలు భరిస్తున్నాడని వైసీపీ కౌంటర్ ఇచ్చింది. షర్మిలకు మద్దతుగావిజయమ్మ మాట్లాడడం ఏంటని ప్రశ్నించింది.

* ఆ ప్రమాదంతోనే అంటున్న వైసిపి
ఈడి అటాచ్మెంట్ లో ఉన్న సరస్వతీ పవర్ కంపెనీకి సంబంధించి షేర్లను విజయమ్మ షర్మిలకు బదలాయించడం వల్లే ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ ఘటనతో జగన్ బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉందని.. అందుకే దీనిని జగన్ బయట పెట్టాల్సి వచ్చిందని.. న్యాయస్థానాన్ని ఆశ్రయించారని గుర్తు చేస్తోంది వైసిపి. అయితే ఎట్టి పరిస్థితుల్లో జగన్ బెయిల్ రద్దు కావాలన్న ఉద్దేశంతో షర్మిల ఈ విధంగా వ్యవహరిస్తున్నారని కూడా అనుమానిస్తోంది. కానీ అవేవీ పట్టించుకోకుండా విజయమ్మ షర్మిల కు షేర్ల బదలాయింపుకు ముందుకు రావడానికి కూడా తప్పుపడుతోంది. షర్మిల తో పాటు విజయమ్మ సైతం జగన్ ప్రత్యర్థులకు సహకరిస్తున్నారని చెబుతోంది. ఈ విషయంలో విజయమ్మను షర్మిల పావుగా వాడుకుంటున్నారని.. ఈ ఎపిసోడ్ వెనుక చంద్రబాబు ఉన్నారన్నది వైసీపీ అనుమానం.

* షర్మిల నిలదీత
అయితే స్వయంగా తల్లి పై న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఏ కొడుకు అయినా చేస్తారా అంటూ షర్మిల ప్రశ్నిస్తున్నారు. తల్లి మనోభావాలను లెక్కచేయని కొడుకు ఒక కొడుకేనా అన్నట్టు షర్మిల నిలదీస్తున్నారు. అయితే కేవలం తన షేర్లను కుమార్తె షర్మిలకు రాయించడం వల్లే విజయమ్మ ఇప్పుడు వైసీపీకి టార్గెట్ గా మారారు. జగన్ బెయిల్ రద్దు చేసే కుట్రలో విజయమ్మ సైతం చేతులు కలిపారని వైసీపీ చెప్తోంది. మొత్తానికైతే ఈ ఘటనతో వైసీపీకి విజయమ్మ సైతం ప్రత్యర్థి కంటే ఎక్కువగా మారారు. వైసీపీ నేతలు ఇప్పుడు శత్రువుగా పరిగణించడం ప్రారంభించారు.