Rishi Sunak: భారత దేశానికి వ్యాపారం కోసం వచ్చి.. మనల్ని బానిసలుగా చేసుకుని 200 ఏళ్లు పాలించిన దేశం బ్రిటన్. మన సంపదను అక్రమంగా తరలించుకుపోయి అన్నిరంగాల్లో అభివృద్ధి చెందింది. అనేక పోరాటాల తర్వాత 1947, ఆగస్టు 15న స్వాతంత్య్రం ఇచ్చింది. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత భారత సంతతికి చెందిన నేత బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయి సంచలనం సృష్టించాడు. భారత్‌ను పాలించిన దేశానికి భారతీయుడు ప్రధాని కావడంతో భారతీయులు సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ ఏడాది జరిగిన బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో ప్రధాని పదవి కోల్పోయాడు. ప్రతిపక్ష స్థానానికి పరిమితమయ్యాడు. తాజాగా ప్రతిపక్ష నేత పదవి నుంచి కూడా తప్పుకున్నారు. భారత మూలాలు ఉన్న రిషి సునక్ అతి చిన్న వయసులో భారత ప్రధానిగా రెండేళ్ల క్రితం బాధ్యతలు చేపట్టారు. ఆయన సారథ్యంలోనే కన్జర్వేటివ్ పార్టీ గత జూలైలో ఎన్నికలకు వెళ్లింది. కానీ, ఈ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. దీంతో రిషి సునక్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. జూలై నుంచి విపక్ష నేతగా ఉన్న రిషి ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నారు. ఈమేరకు బుధవారం ప్రకటించారు.
దీపావళి రోజే..
రిషి సునక్ గతంలో కన్జర్వేటివ్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆర్థిక వేత్త అయిన ఆయన తన ఆర్థిక విధానాలతో దేశాభివృద్ధికి కృషి చేశారు. ఈ క్రమంలో అనూహ్యంగా ఆయనకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది. రెండేళ్ల క్రితం దీపావళి సంబురాల సందర్భంగానే పార్టీ నాయకునిగా ఎన్నికయ్యారు. మళ్లీ అవే దీపావళి ఎన్నికల వేళ ఇప్పుడు ప్రతిపక్ష నేత పదవి నుంచి తప్పుకున్నారు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పార్లమెంట్ వేదికగా వెల్లడించారు. ‘ఈ గొప్ప దేశానికి తొలి బ్రటిష్ ఏషియన్ ప్రధాని కావడాన్ని గర్వంగా భావిస్తున్నా.. బ్రిటన్ అనుసరించే గొప్ప విలువలకు ఇది తార్కాణంగా నిలిచింది’ అని తెలిపారు. తన చివరి ప్రైమినిస్టర్ క్వశ్చన్స్(పీఎం క్యూస్)లో భాగంగా ప్రధాని కియల్ స్టార్మర్‌కు సునాక్ పలు సరదా ప్రశ్నలు వేసి అందరినీ నవ్వించారు.
వెనక బెంచీలో కూర్చుంటా..
ఇక అమెరికాలో స్థరపడాలని తాను భావిస్తున్నట్లు వస్తున్న వార్తలను సునాక్ తోసిపుచ్చారు. రిచ్‌మండ్–నార్త్ అలెర్టన్ ఎంపీగా పార్లమెంటులోనే ఉంటానని, వెనుక బెంచీలో కూర్చుంటానని తెలిపారు. కేవలం ప్రతిపక్ష పదవి నుంచి మాత్రమే తప్పుకుంటున్నానని వెల్లడించారు. దీంతో అందరూ నవ్వుల్లో మునిగిపోయారు.