Pushpa 2: దీపావళి సందర్భంగా బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చిన ‘పుష్ప 2’ టీం..వైరల్ అవుతున్న లేటెస్ట్ పోస్టర్!

కేవలం తెలుగు వెర్షన్ లోనే కాదు, హిందీ వెర్షన్ లో కూడా ఈ పాటకు వ్యూస్ అదిరిపోయాయి. ఇంస్టాగ్రామ్ లో కూడా మిలియన్ల కొద్దీ రీల్స్ చేసారు నెటిజెన్స్. ఇలా సినిమాలో కేవలం యాక్షన్ సన్నివేశాలు మాత్రమే కాదు, హీరో హీరోయిన్ మధ్య మంచి రొమాంటిక్ సన్నివేశాలు, పాటలు ఉంటాయని ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థం అవుతుంది.

Written By: Vicky, Updated On : October 31, 2024 2:32 pm

Pushpa 2(5)

Follow us on

Pushpa 2: దీపావళి సందర్భంగా నేడు త్వరలో విడుదల కాబోతున్న పలు పాన్ ఇండియన్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ని అభిమానులకు అందించారు మేకర్స్. డిసెంబర్ 5వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతున్న ‘పుష్ప 2’ నుండి కూడా లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక కలిసి ఉన్నటువంటి రొమాంటిక్ పోస్టర్ ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేసాడు అల్లు అర్జున్. ఈ పోస్టర్ కి మంచి రీచ్ వచ్చింది. ఇప్పటి వరకు కేవలం యాక్షన్ పోస్టర్స్ ని మాత్రమే విడుదల చేసిన మేకర్స్, మొట్టమొదటిసారి రొమాంటిక్ టచ్ ఉన్న పోస్టర్ ని విడుదల చేసారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ‘చూసేకి అగ్గిపుల్ల మాదిరి ఉంటాడే నా సామీ’ అనే పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

కేవలం తెలుగు వెర్షన్ లోనే కాదు, హిందీ వెర్షన్ లో కూడా ఈ పాటకు వ్యూస్ అదిరిపోయాయి. ఇంస్టాగ్రామ్ లో కూడా మిలియన్ల కొద్దీ రీల్స్ చేసారు నెటిజెన్స్. ఇలా సినిమాలో కేవలం యాక్షన్ సన్నివేశాలు మాత్రమే కాదు, హీరో హీరోయిన్ మధ్య మంచి రొమాంటిక్ సన్నివేశాలు, పాటలు ఉంటాయని ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థం అవుతుంది. ఇది ఇలా ఉండగా నవంబర్ మొదటి వారంలో ఈ చిత్రానికి సంబంధించిన ఐటెం సాంగ్ ని షూట్ చేయబోతున్నారట. పుష్ప పార్ట్ 1 లో ‘ఉ అంటావా మామ’ అనే ఐటెం సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. సమంత నార్త్ ఆడియన్స్ కి ఈ పాట ద్వారా బాగా దగ్గరైంది. పార్ట్ 2 ఐటెం సాంగ్ కోసం ఎవరిని తీసుకోవాలి అనే దానిపై చాలా చర్చలు నడిచాయి. అయితే చివరికి శ్రద్దా కపూర్ ని తీసుకున్నట్టు తెలుస్తుంది. శ్రద్దా కపూర్ కి బాలీవుడ్ లో స్టార్ హీరోలకు ఉన్నంత క్రేజ్ ఉంది. రీసెంట్ గానే ఈమె ‘స్త్రీ 2’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది.

కేవలం హిందీ వెర్షన్ నుండి ఈ సినిమా 900 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిందంటే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనేది అర్థం చేసుకోవచ్చు. అలాంటి సినిమా తర్వాత ఆమె వెంటనే ఈ చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తుంది అనే వార్త రావడంతో బాలీవుడ్ లో ఈ సినిమా పై క్రేజ్ మరింత పెరిగింది. ఈ పాట చిత్రీకరణతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని , నవంబర్ 20 లోపు మొదటి కాపీ రీ రికార్డింగ్ తో సహా పూర్తి అయిపోతుందని అంటున్నారు మేకర్స్. ఇది కాసేపు పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని అతి త్వరలోనే విడుదల చేయబోతున్నారట మేకర్స్. మరో రెండు రోజుల్లో ట్రైలర్ విడుదల తేదీ ప్రకటించి, ప్రొమోషన్స్ ప్రారంభించబోతున్నారట.