Elon Musk: అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరుగనున్నాయి. ఇంకా ఐదు రోజులే గడువు ఉంది. ఈమేరకు ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. కొందరు దుండగులు బ్యాలెట్ డ్రాప్ బాక్సులు ధ్వసం చేస్తున్నారు. పోలీసులు అలర్ట్ అయ్యారు. మరోవైపు అధికార డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచారంతోపాటు పనిలో పనిగా వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. ట్రంప్ ఓ అడుగు ముందుకు వేసి కమలాను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. ఆమె జాతిని ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు. కమలా కూడా ఆరోపణలు దీటుగానే తిప్పి కొడుతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క చేసిన ఓ పని అమెరికాలో దుమారం రేపుతోంది. నెటిజన్లు మండి పడుతున్నారు.
సోషల్ మీడియా చేతిలో ఉందని..
ఇరాన్ చీఫ్ ఇజ్రాయెల్‌పై ఎక్స్ వేదికగా ఆరోపణలు చేస్తున్నాడని అతడి ఎక్‌స ఖాతాను సస్పెండ్ చేయించిన ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం తనది కాబట్టి తాను ఏం చేసినా చెల్లుదుదనుకున్నట్లు ఉన్నారు. అధ్యక్ష ఎన్నికలకు ఐదు రోజుల ముందు.. మస్క్ చేసిన పని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. తనకు ఓనీతి.. ఇతరులకు మరో నీతా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌కు మద్దతు ఇచ్చే క్రమంలో ఆయన పరిధి దాటడంపై మండిపడుతున్నారు. డెమొక్రటిక్ అభ్యర్థి, ఉపాధ్యక్షుఆరలు కమలా హారిస్‌పై హింసాత్మక, అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారు. ట్రంప్, హారిస్ పోటీని గ్లాడియేటర్ నేపథ్య పోరాటంగా అభివర్ణిస్తూ.. అమెరికా సూపర్ పీఏసీ ఎక్స్ పోస్టు చేసిన వీడియోను పోస్టు చేశారు.
అందులో ఏముందంటే..
ఈ వీడియోలో రెచ్చగొట్టే, హింసాత్మక చిత్రాలతో పొందుపర్చిన సన్నివేశాలు ఉన్నాయి. ట్రంప్‌ను చేతిలో కత్తులతో గ్లాడియేటర్‌గా చూపారు. మైదానంలో హారిస్‌తో తలపడుతున్నట్లు, ఆమె ముఖంపై కాలుతో తన్నుతున్నట్లు రూపొందించారు. డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన పెన్సిల్వేనియాలో ర్యాలీ చూపుతూ మస్క్ వయిస్‌తో వీడియో ప్రారంభం అవుతుంది. ఈ ఎన్నికలు అమెరికాతోపాటు పాశ్చాత్య నాగరిక భవితవ్యాన్ని నిర్ణయిస్తాయిన మస్క్ తెలిపారు.
మండిపడుతున్న నెటిజన్లు..
సోషల్ మీడియా తనది కాబట్టి తాను ఏం చేసినా చెల్లుతుంది అన్నట్లు మస్క్ వ్యవహించారని నెటిజన్లు మండిపడుతున్నారు. మస్క్ పోస్టు చేసిన వీడియలో రాకెట్లు, జెట్లు, హాల్క్ చొక్కా విప్పడం, ట్రంప్ ప్రసంగాలు, పలు సినీ క్లిప్పింగులు ఉన్నాయి. దీని సృష్టికర్తలు నియో–నాజీలంటూ విమర్శలు చేశారు. ఇక సూపర్ పీఏసీ ఎక్స్ తంలో హారిస్‌కు వ్యతిరేకంగా వీడియోలు చేసింది. అమె సి–వర్డ్‌గా అభివర్ణిస్తూ∙పోస్ట్ చేసిన వీడియోను వెంటనే తొలగించింది. ఇప్పుడు ట్రంప్‌కు మద్దతుగా వీడియోలు చేస్తోంది. ఇందుకు భారీగా ఖర్చు చేసింది.