https://oktelugu.com/

Princess Martha Louise : అంతచిన్నోడిని మరీ అలాంటోడిని పెళ్లి చేసుకుంటున్న యువరాణి.. ఏంటి ఆ స్పెషల్ అంటే?

అలాగే నమ్రత కంటే సూపర్ స్టార్ మహేశ్ బాబు వయస్సులో చిన్న. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది సెలబ్రిటీలు వాళ్ల కంటే వయస్సులో తక్కువ ఉన్న వాళ్లను వివాహం చేసుకున్నారు. అయితే తాజాగా ఓ దేశపు యువరాణి తన కంటే వయస్సులో చిన్న అయిన వ్యక్తిని వివాహం చేసుకోబోతుంది.

Written By:
  • NARESH
  • , Updated On : August 30, 2024 / 10:02 PM IST

    Princess Martha Louise of Norway

    Follow us on

    సాధారణంగా పెళ్లి చేసుకునే అమ్మాయిలు వాళ్ల కంటే పెద్ద ఉన్నవాళ్లను చేసుకుంటారు. అయితే ఇదంతా ఒకప్పుడు.. ఇప్పుడు ట్రెండ్ అంతా మారిపోయింది. అప్పట్లో పెళ్లి చేయాలంటే వయస్సు అన్ని చూసుకునేవాళ్లు. కానీ ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా వాళ్ల కంటే చిన్న వయస్సున్న వాళ్లను పెళ్లి చేసుకుంటున్నారు. ఈ ట్రెండ్ సాధారణ మనుషుల నుంచి సెలబ్రిటీల వరకు జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు వాళ్ల కంటే చిన్న వయస్సున్న వాళ్లను పెళ్లి చేసుకున్నారు. మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న ప్రియాంక చోప్రా తన కంటే పదేళ్లు చిన్నవాడైన నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకుంది. అలాగే నమ్రత కంటే సూపర్ స్టార్ మహేశ్ బాబు వయస్సులో చిన్న. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది సెలబ్రిటీలు వాళ్ల కంటే వయస్సులో తక్కువ ఉన్న వాళ్లను వివాహం చేసుకున్నారు. అయితే తాజాగా ఓ దేశపు యువరాణి తన కంటే వయస్సులో చిన్న అయిన వ్యక్తిని వివాహం చేసుకోబోతుంది. ఇంతకీ ఎవరు ఆ యువరాణి? ఆమె ఎవర్ని వివాహం చేసుకోబోతుంది? పూర్తి వివరాలు తెలియాలంటే స్టోరీలోకి వెళ్లండి.

    నార్వే యువరాణి మార్తా లూయిస్ వయస్సులో తన కంటే చిన్న వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నారు. తన కంటే మూడేళ్లు చిన్న అయిన హాలీవుడ్ ఆధ్యాత్మిక గురువు అయిన డ్యూరెక్ వెరెట్‌ను వివాహం చేసుకోబోతున్నారు. మార్తా లూయిస్ నార్వే రాజు హరాల్డ్ పెద్ద కుమార్తె. ఆమెకు ఇది రెండో పెళ్లి. గతంలో ఆమె 2002లో ప్రముఖ రచయిత అయిన అరి బెన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల 2017లో వీళ్లు విడిపోయారు. విడాకులు తీసుకున్న రెండేళ్ల తర్వాత అనగా 2019లో మార్తా లూయిస్ భర్త అరి బెన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సంవత్సరంలోనే లూయిస్ సోషల్ మీడియా ద్వారా అధ్యాత్మక గురువు వెరెట్‌తో ఉన్న రిలేషన్‌ను బయట పెట్టారు. అయితే ఎప్పటి నుంచి వీళ్లు ప్రేమలో ఉన్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఆ తర్వాత 2022లో జూన్‌లో ఎంగేజ్‌మెంట్ జరగ్గా ఈ ఏడాది పెళ్లి చేసుకోనున్నారు.

    యూనెస్కో ప్రపంచ వారసత్వ‌ంలో గుర్తింపు పొందిన గీరాంజల్‌లోని నార్వే యువరాణి పెళ్లి జరగనుంది. ఇప్పటికే వీళ్ల పెళ్లి వేడుకలు ప్రారంభం అయ్యాయి. అయితే ఆధ్యాత్మిక గురువు అయిన డ్యూరెక్ వెరెట్‌పై చాలా వివాదాలు ఉన్నాయి. ఆఫ్రికన్ అమెరికన్ అయిన అతను ఎక్కువగా ఆత్మ, మరణం గురించి ప్రచారాలు చేసేవారు. తనకు 28 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు మరణం నుంచి పునరుజ్జీవనం పొందారని అతను చెప్పుకునేవాళ్లు. ఈ విషయంలో అతనికి ఎక్కువగా విమర్శలు వచ్చాయి. అలాగే కరోనా, క్యాన్సర్ వంటి రోగాలను నయం చేస్తానని కోట్లు సంపాదించాడు. ఎందరో ప్రముఖులకు ఆధ్యాత్మిక సలహాదారుగా కూడా ఉన్నారు. అయితే ఇతనకి పిచ్చి ఉందని వెరైటీ పర్సన్ అని అక్కడి మీడియా వర్గాలు చెబుతున్నాయి.