https://oktelugu.com/

Kalki 2 Shooting : కల్కి 2 ‘ షూటింగ్ గురించి ఫ్యాన్స్ అదిరిపోయే అప్డేట్.. ఇంత స్పీడ్ గా ఉన్నారేంటి!

కల్కి 2 సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి, లేదా ఫిబ్రవరి నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు డైరెక్టర్ నాగ అశ్విన్ తెలిపాడు. ఇటీవలే ఆయన రష్యాలోని మాస్కో లో జరిగిన ఒక ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొని ఈ విషయాన్ని పంచుకున్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : August 30, 2024 / 09:58 PM IST

    Kalki 2 Movie

    Follow us on

    Kalki 2 Shooting : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కల్కి’ ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అన్నీ భాషలకు కలిపి సుమారుగా 1200 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టి సంచలనం సృష్టించింది ఈ సినిమా. ఇప్పటికీ పలు థియేటర్స్ లో విజయవంతంగా ఆడుతుందంటే ఏ స్థాయి బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ గానే ఓటీటీ లో విడుదల అవ్వగా, ఆ సెక్షన్ ఆడియన్స్ నుండి కూడా బంపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇంత రిచ్ ప్రొడక్షన్ విలువలతో , హాలీవుడ్ సినిమాలను మరిపించేలా డైరెక్టర్ నాగ అశ్విన్ అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కల్కి చిత్రం హ్యాంగ్ ఓవర్ నుండి పూర్తిగా కోలుకోక ముందే, ‘కల్కి 2 ‘ సంబంధించిన ఒక అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా ని తెగ ఊపేస్తోంది.

    వివరాల్లోకి వెళ్తే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి, లేదా ఫిబ్రవరి నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు డైరెక్టర్ నాగ అశ్విన్ తెలిపాడు. ఇటీవలే ఆయన రష్యాలోని మాస్కో లో జరిగిన ఒక ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొని ఈ విషయాన్ని పంచుకున్నాడు. పార్ట్ 1 షూటింగ్ జరుగుతున్న సమయంలోనే పార్ట్ 2 సంబంధించిన షూటింగ్ 60 శాతం వరకు పూర్తి చేశారట. ఇక కేవలం 40 శాతం షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ప్రభాస్ నుండి తక్కువ డేట్స్ మాత్రమే అవసరం అట. అంటే వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభాస్ హీరో గా నటిస్తున్న ‘రాజా సాబ్’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10 వ తారీఖున విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ‘కల్కి 2 ‘ కూడా అదే ఏడాది లో విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాలతో పాటుగా హను రాఘవపూడి తో చేస్తున్న చిత్రం కూడా వచ్చే ఏడాదిలోనే రానుంది.

    అలా మొత్తం వచ్చే ఏడాది మూడు ప్రభాస్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరోపక్క మిగిలిన స్టార్ హీరోలు కనీసం ఒక్క సినిమా చెయ్యడానికి రెండేళ్ల సమయం తీసుకుంటున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ని పెంచుతూ నెంబర్ 1 హీరో గా కొనసాగుతున్నాడు. ఇదంతా పక్కన పెడితే కల్కి చిత్రం కేవలం రెండు భాగాల్లో పూర్తి అయ్యే సినిమా కాదు అని డైరెక్టర్ నాగ అశ్విన్ ఇప్పటికే ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. రెండవ భాగంలో కేవలం కల్కి పుట్టుక మాత్రమే చూపిస్తామని, మూడవ భాగం లో కల్కి ఎలా పెరిగాడు, ఎలా కలిని అంతం చేసాడు అనేది చూపిస్తారని తెలుస్తుంది. రెండవ భాగంలో అర్జునుడి క్యారక్టర్ కూడా ఉంటుందని సమాచారం.