Polyamorous Man : ఒక భార్యతోనే వేగలేక విడాకులు తీసుకుంటున్న ఈ రోజుల్లో.. ఈ బ్రెజిల్ వ్యక్తి ఈ ఏకంగా తొమ్మిది మందిని పెళ్లి చేసుకున్నాడు. అందులో నలుగురు అతడికి విడాకులు ఇచ్చారు. ఇటీవలే 51 సంవత్సరాలు మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఆరుగురు కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇదే ఒక ఆశ్చర్యం అనుకుంటే.. ఆరుగురు భార్యల్ని సంతృప్తిపరిచే బాధ్యత ఇప్పుడు ఈ “పాలీగమి”(బహు భార్యత్వం) భర్త.. కొత్త ప్రణాళిక రూపొందించాడు. ఇంతకీ అతడు ఏం చేశాడో మీరే చదవండి.
అంత పనీ చేశాడు
మనదేశంలో ఒకరు లేదా ఇద్దరు భార్యలుంటారు. కానీ మారుతున్న కాలంలో ఆడపిల్లలు దొరకక చాలామంది మగవాళ్ళు పెళ్లిళ్లు చేసుకోకుండానే బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారు. కానీ పాశ్చాత్య దేశాల్లో అలా కాదు. అక్కడి సంప్రదాయాలు మన దేశంతో పోల్చితే భిన్నంగా ఉంటాయి. అక్కడ డేటింగ్, లివింగ్ లైఫ్ రిలేషన్ షిప్ సర్వసాధారణం. అందుకే ఇంత త్వరగా కలిసిపోతారో.. అంత త్వరగా విడిపోతారు. కానీ బ్రెజిల్ దేశం సావో పాలో ప్రాంతానికి చెందిన ఆర్థర్ అనే వ్యక్తి తొమ్మిది మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు. వారిలో నలుగురు అతడికి విడాకులు ఇచ్చారు. ఇటీవల 51 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్నాడు. దీంతో అతడికి ఇప్పుడు ఆరుగురు భార్యలయ్యారు. ఏం మాయమాటలు చెప్పాడో, ఎలా ఆకర్షించాడో తెలియదు కానీ అందరితో కలిసే ఉంటున్నాడు. పైగా ఒకరిని తర్వాత ఒకరిని చేసుకోవడం విశేషం.. పెళ్లయితే చేసుకున్నాడు కానీ… వారందరితో హాయిగా పడుకునేందుకు అనువైన పడకగది లేక అతడు చాలా ఇబ్బంది పడేవాడు. ఒకే గదిలో ఆరుగురు భార్యలతో కలిసి కింద పడుకునేవాడు. ఇది అతడి భార్యలకు ఇబ్బంది అనిపించేది.
20.7 అడుగుల బెడ్
తన ఆరుగురు భార్యలతో కలిసి నిద్రించేందుకు అనువైన బెడ్ ఏర్పాటు చేయాలి అని ఆర్థర్ అనుకున్నాడు. ఇందులో భాగంగా తన ఇంట్లో ఓ గదిని బెడ్ రూమ్ గా మార్చాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకు ఏకంగా 15 నెలలపాటు కష్టపడ్డాడు. ఏకంగా 80 లక్షల రూపాయలు ఖర్చు చేసి 20 అడుగుల ఏడు అంగుళాల పొడవుతో పడకగది ఏర్పాటు చేశాడు. తన ఆరుగురు భార్యలతో కలిసి హాయిగా నిద్రించేందుకు ఇది ఉపయోగపడుతోందని అతడు సంతోషంగా చెబుతున్నాడు.

ఘటికుడే
అన్నట్టు ఆర్థర్ మామూలు వ్యక్తేమీ కాదు. ఇతడికి ఇన్ స్టా గ్రామ్ లో రెండు లక్షల పైగా ఫాలోవర్లు ఉన్నారు. వారికి తన వైవాహిక జీవితం గురించి ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటాడు.”నా భార్య లియానా ద్వారా నాకు బహు పెళ్లిళ్లు చేసుకోవాలని నిర్ణయం వచ్చింది. ఆరుగురు భార్యల పేర్లు వల్కివీరియా, ఆల్బు కెర్కీ, వోలిండా మారియా, లుయానా కేజీకి, ఎమెళ్ళీ. వీరిలో నేను లియానా ను కేథలిక్ చర్చిలో వివాహం చేసుకున్నాను. మిగతా వారిని పరస్పర అంగీకారం ద్వారా నా జీవితంలోకి ఆహ్వానించాను” ఆర్థర్ చెప్పాడు.
బహుభార్యత్వం నిషేధం
బ్రెజిల్ దేశంలో బహుభార్యత్వం నిషేధం. అయితే ఆర్థర్ తన ఆరుగురు భార్యలతో కలిసి ఒక సమూహం లాగా ఉంటున్నారు. వీరంతా తమ రొమాంటిక్ వీడియోలను సామాజిక పోస్ట్ చేస్తున్నారు. ఇలా నెలకు 50 లక్షల దాకా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. వైవాహిక జీవితానికి సంబంధించిన చిట్కాలను నెటిజన్ల తో ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు. అయితే ప్రస్తుతం తన పడకగది లో బెడ్ ను 20 అడుగులకు విస్తరించడం వెనక ఆర్థర్ పెద్ద ప్లాన్ దాగుంది. తన ఆరుగురు భార్యలను అతడు సంతృప్తి పరచాలి అనుకుంటున్నాడు. గతంలో ఒక్కొక్కరికి ఒక్కో సమయం కేటాయించేవాడు. కానీ ఇప్పుడు అందరిని ఒకేసారి సంతృప్తి పరచాలి అని యోచిస్తున్నాడు. మనదేశంలో అమ్మాయిలు లేక చాలామందికి పెళ్లిల్లే కావడం లేదు. కానీ ఈ ఆర్థర్ మాత్రం ఏకంగా తొమ్మిది పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఆరుగురు భార్యలతో కలిసి ఉంటున్నాడు. మొత్తానికి అదృష్టం ఉంటే అదృష్టం అంటే ఇతడిదే కాబోలు.