MS Dhoni : ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచులు ఎంత రసవత్తరంగా సాగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఏ మ్యాచ్ కూడా మనం ఊహించిన విధంగా ఉండడం లేదు, ఏది గెలుస్తుంది ఏది ఓడిపోతుంది అనేది చెప్పలేని పరిస్థితి.అయితే ఈ లీగ్ మ్యాచులలో చెన్నై సూపర్ కింగ్స్ టీం తన సత్తా చాటుతుంది అనే చెప్పాలి, ప్రతీ మ్యాచ్ కూడా కచ్చితంగా గెలిచే విధంగానే ఆడుతుంది.
ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో అందరి కంటే టాప్ స్థానం లో ఉంది.ఇప్పటి వరకు 7 మ్యాచులు ఆడితే 5 మ్యాచులు గెలిచింది.ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ టీం తో మ్యాచ్ ఆడుతుంది, దీని ఫలితం కాసేపట్లో తెలియనుంది.అయితే చెన్నై సూపర్ కింగ్స్ టీం బౌలింగ్ ఆర్డర్ లో వీక్ గా ఉన్నా, ఇలా నెంబర్ 1 స్థానం లోకి నిలబడడానికి కారణం ధోని కెప్టెన్సీ స్కిల్స్ ఒకటి అయితే, బ్యాటింగ్ ఆర్డర్ కూడా అద్భుతంగా ఉండడం మరొక కారణం.
ఇది ఇలా ఉండగా ఇది ధోని కి చివరి IPL సీజన్ అనే సంగతి అందరికీ తెలిసిందే.ఈ సీజన్ తర్వాత ఆయన సంపూర్ణంగా క్రికెట్ నుండి తప్పుకోనున్నాడు.కేవలం ధోని కోసమే క్రికెట్ చూసే వారి సంఖ్య కోట్లలో ఉంటుంది, క్రేజ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే ధోని ఇక IPL లో కూడా కనిపించబోడు అనే నిజాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
అయితే ఈ సీజన్ ధోని కి చివరి సీజన్ కాబట్టి BCCI కూడా ఆయన పారితోషికం భారీ మొత్తంలోనే ఇస్తున్నట్టు తెలుస్తుంది.ఒక్కో మ్యాచ్ కి ఆయన అందుకుంటున్న రెమ్యూనరేషన్ అక్షరాలా 88 లక్షల 86 వేల రూపాయిలు. అంటే ఈ లీగ్ లో మొత్తం ఉన్న 14 మ్యాచులకు గాను ఆయన 13 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడట.ఇది IPL హిస్టరీ లోనే సరికొత్త రికార్డు అని తెలుస్తుంది.ధోని తర్వాతి స్థానం లో కోహ్లీ ఉన్నట్టు సమాచారం.