Pakistan Train Hijack: బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ).. బలూచిస్తాన్‌ను పాకిస్తాన్ నుంచి వేరే చేయాలని, స్వతంత్ర దేశంగా ప్రకటించాలని దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సాయుధలు.. తమకు కోసం వచ్చిన ప్రతీసారి పాకిస్తాన్ సైనికులను టార్గెట్ చేస్తుంటారు. ముఖ్యంగా పాకిస్తాన్‌కు చెందిన రైలునే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటారు. 2016 నుంచి ఇప్పటి వరకు గడచిని పదేళ్లలో పది దాడులు జరిగాయి. తాజాగా జనవరి 26న(సోమవారం) జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను సింద్–బలూచిస్తాన్ సరిహద్దులో దాడి చేసింది. బాంబ్ పేలుడతో నాలుగు కోచ్‌లు దెబ్బతింటాయి. పాకిస్తాన్ అధికారులు మాత్రం నష్టం లేదని పేర్కొన్నారు, మీడియా కవరేజ్‌ను కట్టడి చేశారు. ఈ రైలు 90% సైనికులతో ప్రయాణిస్తుంది. బీఎల్‌ఏ దాడులు సైనికులకు ప్రాణసంకటంగా మారుతున్నాయి.
పదేళ్లలో పది దాడులు..
గత 10 సంవత్సరాల్లో బీఎల్‌ఏ జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై పదిసార్లు దాడి చేసింది. గతేడాది నవంబర్‌లో సొరంగాలు, నాసిరాబాద్ బాంబులు పేల్చింది. గత అక్టోబర్‌లో షికాయిత్‌పూర్ పేలుడు జరిపింది. మార్చిలో అయితే బీఎల్‌ఏ రైలు మొత్తాన్ని హైజాక్ చేసింది. అయినా ప్రభుత్వం ఎక్కడా ఈ విషయాలు ప్రకటించడం లేదు. నిజాలు దాస్తుది. వాస్తవారినిక రైలుపై మొదటి దాడి 2016 అక్టోబర్ మొదటి దాడి జరిగింది. ఈ ఘటనలో 19 మంది గాయపడ్డారు. అయినా దాడిని అధికారికంగా దాచిపెట్టారు.
పాక్ భద్రత వైఫల్యాలు..
దాడులు భరించలేక పాకిస్తాన్ ప్రభుత్వం రైలును నిలిపివేసిన సందర్భాలూ ఉన్నాయి. తర్వాత కొన్నిరోజులు సెక్యూరిటీ పెంచినప్పటికీ దాడులు అరికట్టే చర్యలు మాత్రం చేపట్టడం లేదు. ఈ రైలు బలూచిస్తాన్ రాజధాని నుంచి కైబర్‌ఫఖ్తూంగ్వా రాజధాని పెషావర్ వరకు పాకిస్తాన్‌లో సుదీర్ఘ ప్రయాణం చేస్తుంది. ఇందులో ప్రయణించేవారిలో 90 శాతం మంది సైనికులే. అందుకే బలూచ్ విభజనవాదులు సైనిక రవాణాను లక్ష్యంగా చేస్తున్నారు. ఏడు దశాబ్దాల పోరాటం బలూచిస్తాన్ విడిపోవాలనే డిమాండ్‌తో కొనసాగుతోంది.
ఈ దాడులు పాకిస్తాన్ అంతర్గత భద్రతా వైఫల్యాలను బయట పెడుతుంది. ఖ్వట్టా–పెషావర్ రూట్ మీద పంజాబ్ సైనికులు ఎక్కువగా ఉండటం వల్ల టెన్షన్ పెరుగుతోంది. శాశ్వత చర్యలు మాత్రం చేపట్టడం లేదు.