https://oktelugu.com/

Shehbaz Sharif: ట్రంప్ ప్రసన్నం కోసం పాకిస్తాన్ పాకులాట.. ట్విట్టర్లో శుభాకాంక్షలు.. నెటిజన్ల మండిపాటు

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికకైన ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు మన దాయాది దేశం పాకిస్తాన్‌ పాకులాడుతోంది. చైనాతో చెట్టాపట్టాల్‌ వేసుకుతిరుగుతున్న పాకిస్తాన్‌.. ట్రంప్‌ ఆశీస్తుల కోసం వెంపర్లాడుతోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 10, 2024 / 09:36 AM IST

    Shehbaz Sharif

    Follow us on

    Shehbaz Sharif: అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగి ఐదు రోజులైంది. అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం సాధించారు. పోలింగ్‌ పూర్తయిన వెంటనే కౌంటింగ్‌ ప్రారంభమైంది. వెంట వెంటనే ఫలితాలు వెల్లడయ్యాయి. నవంబర్‌ 7వ తేదీ ఉదయం నాటికి గెలుపు ఎవరిదో తేలిపోయింది. దీంతో భారత ప్రధాని మోదీతోపాటు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ప్రధానులు, అధ్యక్షులు ట్రంప్‌కు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కూడా ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే పాకిస్తాన్‌ మాత్రం ఆలస్యంగా మేల్కొంది. తాజాగా ట్రంప్‌కు పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆయన ఎక్స్‌ వేదికగా ఈ శుభాకాంక్షలు తెలుపడం చర్చనీయాంశమైంది. పాకిస్తాన్‌లో ఎక్స్‌పై నిషేధం అమలులో ఉంది. కానీ పాక్‌ ప్రధాని మాత్రం ఎక్స్‌ వేదికగా ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలుపడం గమనార్హం. నిషేధిత యాప్‌ వాడిన షెహబాజ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రజలకో రూల్, పాలకులకు ఓ రూలా అని ప్రశ్నిస్తున్నారు. ఎక్స్‌ వేదికగానే షెహబాజ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

    షెహబాజ్‌ సందేశం ఇలా..
    ఇక ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పాకిస్తాన్‌ ఫ్రధాని షెహబాజ్‌ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. ‘రెండోసారి అమెరికా అధ్యక్షుడు కాబోతున్న డొనాల్డ్‌ ట్రంప్‌కు అభినందనలు. పాకిస్తాన్‌–అమెరికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం రాబోయే పాలకులతో కలిసి పనిచేయాలను ఎదురు చూస్తున్నాం అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ కమ్యూనిటీ నోట్స్‌ను యాడ్‌ చేసింది. అందులో ప్రధాని షెహబాజ్‌ పాక్‌లో ఎక్స్‌ను నిసేధించిన విషయాన్ని గుర్తు చేసింది. వీపీఎన్‌ను ఉపయోగించి ప్రధాని ఎక్స్‌ను యాక్సెజ్‌ చేసినట్లు పేర్కొంది. దీంతో ఈ పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. పాక్‌ ప్రధానిపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎక్స్‌ను పునరుద్ధరించకుండా.. దేశ ప్రధాని దానిని వినియోగించడంపై మండి పడుతున్నారు.

    భద్రతా కారణాలతో నిసేధం..
    ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌ జాతీయ భద్రతా కారణాల పేరుతో సామాజిక మాధ్యమం ఎక్స్‌ను నిషేధించింది. ఈమేరకు సమాచార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బెలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు తమ దేశ వ్యతిరేక కార్యకలాపాలను వ్యాప్తి చేసేందకు ఎక్స్‌ను వినియోగిస్తున్నట్లు ఆరోపించారు. దీంతో ఎక్స్‌పై పాక్‌ ప్రభుత్వం నిసేధం విధించింది.