https://oktelugu.com/

Kanguva: కంగువా సినిమా అలా ఉంటే మాత్రం తెలుగు ప్రేక్షకులు రిజక్ట్ చేస్తారు…

సినిమా ఇండస్ట్రీ అనేది సముద్రం లాంటిది. ఇక్కడ సక్సెస్ సాధించాలి అంటే అహర్నిశలు కష్టపడుతూ ముందుకు సాగాలి. అంతే తప్ప ఏ కొంచెం నిర్లక్ష్యం వహించిన కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోవాల్సిందే. ఇక ఇప్పటివరకు చాలామంది దర్శకులు స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపు సంపాదించుకొని ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి ఫేయిడ్ ఔట్ అయిపోయిన వారు ఉన్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 10, 2024 / 09:31 AM IST

    Surya Kanguva Movie

    Follow us on

    Kanguva: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులు ఇతర భాషల సినిమాలను కూడా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. కంటెంట్ బాగుంటే చాలు తెలుగు ప్రేక్షకులు ఎలాంటి సినిమాను అయిన ఆదరిస్తారని చెప్పడానికి ఇంతకుముందు వచ్చిన చాలా సినిమాలను మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలందరు తమదైన రీతిలో సత్తా చాటుతున్నారు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇతర భాషల హీరోలు కూడా వాళ్ళ సినిమాలను భారీ రేంజ్ లో రిలీజ్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునైతే ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన రేంజ్ అనేది భారీగా విస్తరిస్తూ ఉండడంతో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో గా వెలుగొందుతున్న సూర్య తెలుగులో కూడా అంత మంచి గుర్తింపును సంపాదించుకొని ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడున్న స్టార్ హీరోలతో పోటీపడుతూ మరి ఆయన తన సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు అంటే ఆయనకు తెలుగు సినిమా అభిమానులు ఏ రేంజ్ లో స్టార్ డమ్ ను కట్టబెట్టారో మనం అర్థం చేసుకోవచ్చు.

    ఇక ఇదిలా ఉంటే ఈనెల 14వ తేదీన సూర్య హీరోగా నటించిన ‘కంగువా’ సినిమా రిలీజ్ అవుతున్న నేపధ్యం లో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకుంటున్నాయి.

    ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ సాధించాలంటే మాత్రం బాహుబలి, కల్కి లాంటి సినిమాలతో కంపరిజన్స్ లేకుండా చాలా ఓపెన్ మైండ్ గా ఆడియన్స్ ఈ సినిమాని చూడాలి. అలాగే ఇంతకు ముందు వచ్చిన సినిమాల రిఫరెన్స్ లను వాడకుండా ఈ సినిమాలో గ్రాఫిక్స్ డిజైనింగ్ కానీ, కథ గాని నెక్స్ట్ లెవెల్లో ఉండాలి.

    అలా ఉంటేనే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుంది అంతే తప్ప లేకపోతే మాత్రం ఈ సినిమాను ఆదరించే ప్రేక్షకులు కరువవుతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని సాధిస్తుందని సూర్య చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…