Imran Khan : తమది ప్రజాస్వామ్య దేశం నమ్మించేదుకు పాకిస్తాన్‌లో ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. అయితే ఈ ఎన్నికలు పేరుకే ప్రజాస్వామ్యయుతం. వాటి వెనుక సైన్యం ఉంటుంది. పాకిస్తాన్ ప్రధాని ఎవరు కావాలని నిర్ణయించేంది పరోక్షంగా సైన్యమే. తమకు అనుకూలంగా ఉన్న పార్టీకే సైతన్యం మద్దతు ఇస్తుంది. సైన్యం మద్దతు ఇచ్చిన పార్టీనే ఎన్నికల్లో గెలుస్తుంది. ఇలా ప్రభుత్వం అంటే పరోక్షంగా సైన్యమే. ప్రజస్వామ్య యుతంగా ఎన్నికైన పాలకులు సైన్యం చేతిలో కీలుబొమ్మలే. సైన్యం అనుకూలంగానే పాలన సాగిస్తారు. మొదట తమకు అనుకూలంగా ఉండి.. తర్వాత తోక జాడించే అధ్యక్షులు, ప్రధానులనులపై ఉగ్రవాదులతో దాడిచేయించిన ఘటనలు కూడా ఉన్నాయి. బెనజీర్ బుట్టో, నవబాజ్ షరీష్, ముషరఫ్ అలీ తదితరులు సైనిక బాధిత ప్రధానులే. తాజాగా ఈ జాబితాలో మాజీ క్రికెటర్, పాకిస్తాన్‌కు వన్డే వరల్డ్ కప్ అందించిన ఇమ్రాన్‌ఖాన్ కూడా చేశారు. ఐదేళ్లు పాలించకుండానే ఇమ్రాన్‌ఖాన్‌ను పదవి నుంచి దించేసిన అక్కడి సైన్యం తర్వాత అతనిపై అనేక అభియోగాలు మోపి అరెస్టు చేసింది. జైల్లో పెట్టింది. కొన్నింటిలో ఇమ్రాన్ బెయిల్ వచ్చినా.. కొన్ని కేసుల్లో ఇంకా విచారణ కొనసాగుతోంది. కొన్ని కేసుల్లో ఇమ్రాన్ దోషిగా నిర్ధారించింది పాకిస్తాన్ కోర్టు దీంతో జైల్లోనే ఉంటున్నారు. ఇదిలా ఉండగా సైన్యం ఇమ్రాన్‌ఖాన్ పార్టీని రద్దు చేసే యోచనలో కూడా ఉంది. ఈమేరకు పావులు కదుపుతోంది. పార్లమెంటులో ఆ పార్టీ లేకుండా చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. మరోవైపు ఇమ్రాన్‌ఖాన్ బయటకు రాకుండా చూస్తోంది. ఒక వేళ కోర్టు తీర్పుతో బయటకు వచ్చినా.. పాకిస్తాన్‌లో ఉండకుండా దేశం విడిచిపోవాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. ఇందులో భాగంగానే ఇమ్రాన్‌ఖాన్ పార్టీ లేకుండా వ్యూహరచన చేస్తోంది.
ప్రధాని పదవి పోతే దేశం వీడాల్సిందే..
పాకిస్తాన్‌లో నేతలు ఉంటే.. ప్రధాని పదవిలో ఉండాలి. పదవి అయిపోగానే దేశం విడిచి పారిపోవాలి. లేదంటే… మనుగడ సాగించడం కష్టం. ఇందుకు ఇమ్రాన్‌ఖాన్ ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితే నిదర్శనం. గతంలో నవాజ్ షరీఫ్, ముషరఫ్ అలీ కూడా సైన్యం చర్యలతో ఇబ్బందులు పడ్డారు. జైలు శిక్ష అనుభవించారు. జైలు నుంచి విడుదలయ్యాక దేశం విడిచి వెళ్లిపోయారు. అమెరికా, అండన్, దుబయ్‌లో స్థిరపడ్డారు. అయితే పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను సైన్యం దించిన తర్వాత ఆయన ఎన్నికల్లో తిరిగి పోటీ చేశారు. బలమైన ప్రతిపక్షంగా ఎదిగారు. ఇది సైన్యానికి నచ్చలేదు. దీంతో ప్రభుత్వం సైన్యం సూచనల మేరకు ఇమ్రాన్‌పై అనేక నేరారోపణలు చేసి జైలుకు పంపింది.
దేశం వీడిన ఇమ్రాన్ భార్యలు..
సైన్యం పెడుతున్న ఇబ్బందులతో ఇమ్రాన్‌ఖాన్ భార్యలు దేశం వీడి వెళ్లిపోయారు. ఇమ్రాన్ మాత్రం పాకిస్తాన్‌లోనే ఉండి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వచ్చారు. జైల్లో ఉండి కూడా పాలకులకు ఇబ్బందిగా మారాడు. దీంతో పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ లేకుండా చేసేందుకు సైన్యం. ఐఎస్‌ఐ, ప్రభుత్వం పావులు కదుపుతున్నాయి. మరోవైపు ఆదేశ అతున్నత న్యాయస్థానం ఇమ్రాన్‌ఖాన్ కేసులపై విచారణ జరుపుతూ కొన్నింటిలో నిర్దోషిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో సైన్యం అతడిని జైల్లోనే అంతం చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. లేదంటే క్షమాపణ కోరి దేశం వీడి వెళ్లేలా ఒత్తిడి చేస్తోంది.
ఇరుకు పంజరంలో ఇమ్రాన్..
ఇదిలా ఉంటే.. తాజాగా సైన్యం ఇమ్రాన్‌ను జంతువులను బంధించే ఇరుకు పంజరంలో బంధించింది. ఏడు అడుగుల పొడవు. నాలుగు అడుగుల వెడల్పుతో ఉన్న బోనులో ఉంచింది. ఈ విషయాన్ని ఇమ్రాన్‌ఖాన్ జైలు నుంచి డాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తనను తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన ఆవేదన వ్యక్తం చేశారు. అంటే పాకిస్తాన్‌లో సైన్యంతో సఖ్యతగా ఉన్నంతకాలమే ఏ రాజకీయ నాయకుడు అయినా సుఖంగా జీవనం సాగిస్తారు. కాదని ఎదురు తిరిగితే ఇమ్రాన్‌ఖాన్ గతే.