Pakistan Airline: రోడ్లు సరిగా ఉండవు. ఎప్పుడు ఎక్కడినుంచి బాంబులు వస్తాయో తెలియదు. ఎవడిని ఎవడు అంతం చేసుకుంటాడో అర్థం కాదు. ఎందుకు కాల్పులు జరుపుకుంటారు అంతు పట్టదు. అటువంటి దేశంలో అక్షరాస్యత ఎలా ఉంటుంది.. అభివృద్ధి ఎలా ఉంటుంది.. పరిపాలన ఎలా ఉంటుంది.. ఈ విషయాలపై ఇట్టే ఒక అవగాహనకు రావచ్చు. ఈ ఉపోద్ఘాతం చదివితేనే మీకు అర్థమైంది అనుకుంటా..మేం చెప్పేది పాకిస్తాన్ గురించి అని.. ఇలాంటి ఉపోద్ఘాతాలే కాదు.. ఇంతకంటే అధమ స్థాయిలో పద ప్రయోగం చేసినా అది తక్కువే అవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ అలా ఉంటుంది కాబట్టి.
Also Read: జిమ్ కు వెళ్లలేదు.. చాట్ జిపిటి తో 11 కిలోల బరువు తగ్గాడు.. ఎలాగంటే
ఎటు చూసినా దరిద్రమే.. పైగా పరిపాలకుల అవినీతి.. పెట్రేగిపోతున్న ఉగ్రవాదం.. సైన్యం మితిమీరిన పెత్తనం ఇవన్నీ కూడా పాకిస్తాన్ దేశాన్ని ప్రపంచం ముందు అత్యంత చులకన చేస్తున్నాయి.. విదేశీ మారక ద్రవ్య నిల్వలు దారుణంగా పడిపోతున్నాయి. కంపెనీలు మా వల్ల కాదంటూ వెళ్ళిపోతున్నాయి. ఇక ఇటీవల కాలంలో పరిస్థితులు మరింత దారుణంగా చేయి దాటిపోయాయి. ఇలానే ఉంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే దేశం ఒకటి ఉందని చదువుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ దేశానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది.. నిజానికి మనిషి అనేవాడు ఎవరూ అటువంటి ప్రయత్నం చేయరు. చేయడానికి కూడా సాహసించరు.
నేటి కాలంలో ముఖ్యంగా మనదేశంలో ఒక జిల్లా దాటితేనే రకరకాల ధ్రువపత్రాలను పోలీసులకు చూపించాల్సిన పరిస్థితి. ఇక ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రం లోకి వెళ్తే.. ఒకవేళ పోలీసులు గనక ఆపితే కచ్చితంగా మన ఐడెంటిటీ కార్డులను చూపించాల్సిందే. సొంత దేశంలో ఉన్నప్పటికీ.. సొంత ప్రజలుగా గుర్తింపు ఉన్నప్పటికీ.. పోలీసులు ధ్రువపత్రాలను అడిగితే కచ్చితంగా చూపించాల్సిందే.. మనదేశమే కాదు.. ఇతర దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. అయితే పాకిస్తాన్ ఇందుకు భిన్నం కదా. పైగా అక్కడ ధ్రువపత్రాలు.. గివపత్రాలు అంటూ ఉండవు. అలాంటి అవకాశాన్ని ఓ వ్యక్తి అనుకూలంగా మలుచుకున్నాడు. పాస్పోర్ట్ లేకుండా.. వీసా లేకుండా ఏకంగా విదేశీ ప్రయాణానికి వెళ్ళాడు. పాకిస్తాన్ దేశానికి చెందిన మాలిక్ షాజైన్ లాహోర్ నుంచి కరాచీ వెళ్లాలి. అయితే అతడు పొరపాటున సౌదీ అరేబియా విమానం ఎక్కాడు. సౌదీలోని జెడ్డా ప్రాంతంలో ఆ విమానం ల్యాండ్ అయింది. పాస్పోర్ట్ లేకపోవడంతో అతని ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విచారించి పంపించారు.
ఈ ఉదంతం మీడియాలో ప్రముఖంగా రావడంతో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పాకిస్థాన్ వాళ్లకు మాత్రమే ఇలా సాధ్యమవుతుందని.. పాస్పోర్ట్ లేకుండా.. వీసా లేకుండా ఏకంగా విదేశాలకే వెళ్లొచ్చా అంటూ..నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. పాస్పోర్ట్, వీసా చెకింగ్ లేకుండా అతడు పాకిస్తాన్లో విమానం అయితే ఎక్కగలిగాడు. కానీ చివరికి సౌదీ ఇమ్మిగ్రేషన్ అధికారులకు దొరికిపోయాడు. ఇదే పాకిస్తాన్ దేశానికి.. మిగతా దేశాలకు తేడాను నిరూపిస్తోంది.