Sivakumar YSR Congress EC letter: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ గుర్తును మార్చాలని ఈసీకి లేఖ అందిందా? ఇప్పుడు ఉన్న ఫ్యాన్ గుర్తుకు కాదని మరో గుర్తును కేటాయించాలని కోరారా? ఆ పార్టీ అధ్యక్షుడు పేరుతో లేఖ ఈసీకి అందిందా? సోషల్ మీడియాలో దీనిపైనే చర్చ జరుగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 2011లో ఆవిర్భవించింది. అప్పట్లో అధినేత జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఎన్నికల కమిషన్ ఫ్యాన్ గుర్తును కేటాయించింది. అయితే ఇప్పుడు ఫ్యాన్ గుర్తుకు బదులు గొడ్డలి కావాలంటూ కొలిశెట్టి శివకుమార్ పేరిట ఈసీకి లేఖ అందినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై తాజాగా శివకుమార్ స్పందించారు. ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
ఇలా లేఖ రాసినట్లు..
మా పార్టీకి ప్రస్తుతం ఫ్యాన్ గుర్తు( fan symbol) ఉంది. పలు అంతర్గత సంప్రదింపుల అనంతరం మా పార్టీ చిహ్నాన్ని గొడ్డలి గుర్తుగా మార్చాలని నేను ఏకగ్రీవంగా నిర్ణయించాను. మా పార్టీ భవిష్యత్తు, గుర్తింపు, రాజకీయ వ్యూహం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాను. 1968 ఎన్నికల చిహ్నాల ఆర్డర్ ప్రకారం సంబంధిత నియమాలు, విధానాలకు అనుగుణంగా వీలైనంత త్వరగా గొడ్డలిని తమ పార్టీకి చిహ్నంగా కేటాయించాలని కోరుతున్నాను. పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానాలు, డాక్యుమెంట్లు, ఆ ఫిదా విట్లను లేక కు జత చేశాను. మీ సానుకూల పరిశీలన కోసం మేము ఎదురు చూస్తున్నాం అంటూ శివకుమార్ లేఖ రాసినట్లు ప్రచారం సాగింది.
Also Read: Hindi language controversy : ‘హిందీ’ భజన.. నిజంగా బూమరాంగే!
రాజశేఖర్ రెడ్డి పై అభిమానంతో..
శివకుమార్ ( Sivakumar) రాజశేఖర్ రెడ్డి వీరాభిమాని. అందుకే ఆయన పేరుతో పార్టీని రిజిస్టర్ చేశారు. అయితే రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విభేదించారు. సొంతంగా పార్టీని ఏర్పాటు చేశారు. అప్పటికే శివకుమార్ ఆ పేరుతో పార్టీని రిజిస్టర్ చేయడంతో.. ఆయన సమ్మతి మేరకు జగన్మోహన్ రెడ్డి 2011లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు అదే శివకుమార్ పేరుతో ఏకంగా ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసినట్లు ప్రచారం సాగుతోంది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో గొడ్డలి ప్రధాన భూమిక పోషించింది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో హత్యా రాజకీయాలు నడిచాయని ఆరోపణలు రావడంతో.. ఇప్పుడు అదే గొడ్డలి గుర్తును కావాలి అంటూ ఆ పార్టీ అధ్యక్షుడు లేఖ రాసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. దీనిపై స్పందించారు శివకుమార్. అది ఫేక్ లెటర్ అని తేల్చి చెప్పారు. అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి సూచించారు. తాను ఎవరికీ లేఖ రాయలేదని తేల్చి చెప్పారు.