War 2 vs Coolie comparison:ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సినిమాల మధ్య పోటీ అనేది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. స్టార్ హీరోలైన, చిన్న హీరోలైన ఎవరి సినిమాల మధ్య అయిన ఏదో ఒకసారి ఒక క్లాష్ అయితే జరుగుతూనే ఉంటుంది. ఇక ముఖ్యంగా పండగల సీజన్లు, హాలిడేస్ ని బేస్ చేసుకొని సినిమాలను రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇక ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 14వ తేదీన జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), హృతిక్ రోషన్ (Hruthik Roshan) కలిసిన వార్ 2 (War 2) సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక అదే రోజు రజనీకాంత్ హీరోగా నాగార్జున విలన్ గా నటించిన కూలీ (Cooli) సినిమాని సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు సినిమాల మధ్య భీకరమైన పోటీ అయితే నడుస్తోంది. ఇప్పటికే వార్ 2 సినిమాని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ వారు రిలీజ్ చేస్తూ ఉండడం విశేషం… మరి దీనివల్ల వార్ 2 సినిమాకి ఎక్కువ థియేటర్లు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక కూలీ సినిమా కోసం ఎదురుచూసే జనాలు కూడా ఉన్నారు. రజనీకాంత్ లాంటి నటుడు ఒక సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమా కోసం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాడు.
Also Read: రాజమౌళి సక్సెస్ సీక్రెట్స్ ఇవేనా.? మొత్తం వేరే ఉందిగా..?
అలాంటి రజనీకాంత్ కూలీ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి ఈ రెండు సినిమాల్లో విజయం ఎవరిని వరిస్తుంది ఎవరు టాప్ పొజిషన్ కి వెళ్తారు. ఎవరు నెగెటివ్ టాక్ ను సంపాదించుకొని పాతాళానికి పడిపోతారు అనేది ఇప్పుడు కీలకమైన అంశంగా మారనుంది…
మరి ఏది ఏమైనా కూడా తెలుగులో రజనీకాంత్ మేనియా వర్కౌట్ అవుతుందా? ఇక ఎన్టీఆర్ స్టామినా సక్సెస్ ని క్రియేట్ చేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ రెండు సినిమాలు కూడా ఇతర భాషల నుంచి వస్తున్న సినిమాలే కావడం, ప్రాపర్ తెలుగు సినిమా ఒకటి కూడా లేకపోవడం కూడా కొంత ఇబ్బందిని కలిగిస్తున్నప్పటికి సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఒకటైపోయింది. కాబట్టి ఈ రెండు సినిమాలకు చాలా వరకు ప్లస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి…
Also Read: మహేష్ బాబు కోసం అంత పెద్ద త్యాగం చేసిన రాజమౌళి…
మొదటి షో తో ఏ సినిమా అయితే పాజిటివ్ టాక్ సంపాదించుకుంటుందో ఆ సినిమా భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టే అవకాశాలైతే ఉన్నాయి… ఏ సినిమాకి కొంచెం నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుందో ఆ సినిమా కొంతవరకు డీలా పడిపోయే పరిస్థితి అయితే ఏర్పడవచ్చు. చూడాలి మరి ఈ రెండు సినిమాల మధ్య జరిగే భీకరమైన పోటీలో విజయం ఎవరిని వరిస్తుందనేది…