Oldest Man: ఈ రోజుల్లో ఒక 50 ఏళ్లు జీవించడం అంటే చాలా కష్టం. మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్ల వల్ల చాలా మంది తక్కువ కాలం మాత్రమే జీవిస్తున్నారు. ముఖ్యంగా 60 ఏళ్లు జీవించడం కూడా కష్టంగా మారింది. కానీ పూర్వ కాల మనుషులు అయితే ఇప్పటికీ కొందరు జీవిస్తున్నారు. వారు తీసుకునే ఆహార అలవాట్ల వల్ల కొందరు వందేళ్లు పూర్తయిన కూడా జీవిస్తున్నారు. అయితే ఈ ప్రపంచంలో అత్యంత వృద్ధుడు కూడా ఉన్నాడు. అతనే జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్ వుడ్. ఇతను ఇటీవల నవంబర్ 25న ఇంగ్లాండ్‌లో కన్నుమూశారు. ప్రస్తుతం ఇతని వయస్సు 112 సంవత్సరాలు. మూడు నెలల కిందట జాన్ తన 112వ జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ రోజుల్లో ఇన్నేళ్లు జీవించడమంటే గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే చిన్న వయస్సు నుంచే అనారోగ్య సమస్యలతో కొందరు బాధపడుతున్నారు. కానీ ఇతను ఇన్నేళ్లు జీవించాడు. అతని ఆహార జీవనశైలి ఎంత ఆరోగ్యంగా ఉందో మీ ఊహకే వదిలేస్తున్నాను. అయితే జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్ వుడ్ 1912 ఆగస్టు 26న ఇంగ్లాండ్‌లో జన్మించాడు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జాన్ వరల్డ్ గిన్నిస్ రికార్డ్స్‌లోకి కూడా ఎక్కారు.
ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా అతన్ని గుర్తించారు. ఈ సందర్భంగా అతని ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించడానికి కారణాలు ఏంటో కూడా తెలిపారు. అయితే ఎక్కువ కాలం లేదా తక్కువ కాలం జీవించడం మన చేతుల్లో లేదు. కానీ ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంది. మీరు తీసుకునే ఫుడ్ బట్టి ఆరోగ్యంగా ఉంటారు. దీంతో మీరు ఎన్ని రోజులు జీవించాలనేది.. నిర్ణయిస్తుందని నిపుణులు తెలిపారు. చెడు అలవాట్ల కంటే మంచి అలవాట్లు ఉంటే జీవితం సాఫీగా సాగుతుందని అతని చెప్పారు. జాన్ టిన్నిస్ వుడ్ తన జీవితంలో ఎప్పుడూ కూడా చెడు అలవాట్లకు లోనుకాలేదు. ఎప్పుడో ఒకసారి మద్యం సేవించేవారట. తన జీవితంలో ఒక్కసారి కూడా ధూమపానం చేయలేదట. అలాగే పోషకాలు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే చేపలను ఎక్కువగా తినేవారట. టిన్నిస్ మొదటి బ్రిటష్ ఆర్మీలో పనిచేసి రిటైల్ అయ్యారట. ఆ తర్వాత కొన్నాళ్లు అకౌంటెంట్‌గా కూడా పని చేశారట. అలాగే ఫుడ్‌కి తగ్గట్లుగా వ్యాయామం కూడా చేసేవారని టెన్నిస్ గతంలో చెప్పుకొచ్చారు.
ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చాలా ముఖ్యమైనది. కానీ ఈ రోజుల్లో చాలా మంది వారి పనుల్లో బిజీ అయిపోయి కనీసం నడవడం లేదు. ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించడానికి వ్యాయామం, యోగా, మెడిటేషన్ చాలా ముఖ్యమైనవని టెన్నిస్ అంటున్నారు. ఎందుకంటే ఆరోగ్యంగా చేయడం వల్ల కండరాలు అన్ని బలంగా తయారవుతాయి. ఒకే ప్లేస్‌లో అలా కూర్చోవడం వల్ల మొద్దు బారిపోతారట. అలాగే బద్ధకం కూడా పెరిగిపోతుంది. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. అదే ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావట. ఆరోగ్యంగా జీవితంలో ఎక్కువ కాలం బతకాలంటే.. పోషకాలు ఉండే ఆరోగ్యమైన ఆహారం, వ్యాయామం, ఒత్తిడి లేకపోవడం అన్ని ముఖ్యమని టెన్నిస్ తెలిపారు.