pregnancy : తల్లి అవడం అంటే ఎంతో గొప్ప విషయం. ప్రస్తుతం తల్లిదండ్రులు కావడం పెద్ద సమస్యగా మారింది. ఎన్నో అంతరాలను దాటుకొని బయటపడితే కానీ తల్లిదండ్రి అనే పోస్ట్ రావడం లేదు. మారుతున్న జీవన శైలి, వాతావరణం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. పిల్లలు లేని వారు అడాప్ట్ చేసుకోవడానికి కూడా రెడీ అవుతున్నారు. ఇక పిల్లలు పుట్టరని తెలిసి క్షోభకు గురి అవుతున్నారు. ఇదిలా ఉంటే కొందరికి మాత్రం ఈ సమస్య పెద్దగా ఉండటం లేదు. కానీ గర్భవతి అయిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం చాలా అవసరం. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేద్దాం.
గర్భం అనేది ఒక అందమైన ప్రయాణం. ఆరోగ్యకరమైన అనుభవం కోసం మీరు ఈ జాగ్రత్తలు పాటించండి. మీరు మీ బేబీ ఆరోగ్యంగా ఉండండి. జాగ్రత్తల్లో ముఖ్యంగా సమతుల్య ఆహారం అవసరం. ప్రోటీన్లు, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ లను కచ్చితంగా మీ డైట్ లో ఉండేలా చూసుకోండి. డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ అయినా ఒకే లేదంటే ఇవి ఉండే ఆహారాలను తీసుకోవాలి. శరీరాన్ని డీ హైడ్రేటెడ్ కానివ్వద్దు. నిర్జలీకరణాన్ని నివారించడానికి పుష్కలంగా నీరు తాగడం అలవాటు చేసుకోండి.
ధూమపానం/మద్యపానం అలవాటు ఉంటే మాత్రం తక్షణమే మానేయండి. ఇది మీకు మీ బిడ్డకు ఇద్దరికీ హాని చేస్తుంది. క్లియర్ స్టీరింగ్ ద్వారా మీ బిడ్డ ఎదుగుదలను రక్షించుకోవచ్చు. ఈ అలవాట్ల వల్లనే మీకు ఆలస్యంగా బిడ్డ పుట్టబోతున్నారు. ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ మీ బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ బాధ్యత. తగినంత విశ్రాంతి చాలా అవసరం. మీకు, మీ బిడ్డ ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. కాబట్టి తగినంత నిద్ర పోవడం అలవాటు చేసుకోండి.
సురక్షితంగా వ్యాయామం చేయడం కూడా అలవాటు చేసుకోండి. ఈ సమయంలో బాడీని యాక్టివ్ గా ఉంచాలి. గర్భవతి అని మరీ ఎక్కువ రెస్ట్ ఇవ్వవద్దు. మీ ఆరోగ్యం బాగుంటే కొన్ని చిన్న చిన్న పనులు చేయడం అలవాటు చేసుకోండి. దీంతో పాటు వ్యాయామాలను మర్చిపోవద్దు. తేలికపాటి వ్యాయామాలు లేదా ప్రినేటల్ యోగా చేయడం అలవాటు చేసుకుంటే మీ డెలివరీ సుఖాంతం అవుతుంది.
ఈ సమయంలో ఒత్తిడిని తీసుకోవద్దు. మైండ్‌ఫుల్‌నెస్, రిలాక్సేషన్ టెక్నిక్‌లను ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ బేబీ, మీరు బాగుంటారు. అన్నింటితో పాటు రెగ్యులర్ చెక్-అప్‌లను మర్చిపోవద్దు. బిడ్డ ఎదుగుదల, ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ మీ డైట్ ను మార్చుకుంటూ మీ ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ బేబీ..