https://oktelugu.com/

Nails : మీ గోర్లు మీ ఆరోగ్యం గురించి తెలుపుతాయని మీకు తెలుసా?

అందం అంటే ఓన్లీ ఫేస్ ది మాత్రమే కాదండీ బాబు శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవం కూడా అందంగానే ఉంటుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 29, 2024 / 04:00 AM IST

    nails

    Follow us on

    Nails : అందం అంటే ఓన్లీ ఫేస్ ది మాత్రమే కాదండీ బాబు శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవం కూడా అందంగానే ఉంటుంది. అందుకే కొందరు వాటిని కూడా అందంగా మరల్చడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముస్తాబు చేయడంలో వెనకాడరు. టాటూలు, గాజులు, చెవి దుద్దులు, రింగ్స్, వాచ్ లు ఇలా ఎన్నో రకాలుగా అలకరించి వాటిని అందంగా మారుస్తారు. వీటన్నింటితో పాటే వేళ్లు. ఇక చేతి వేళ్లను ఎంత అందంగా కనిపించేలా చూసుకుంటారో కాళి వేళ్లను కూడా అంతే అందంగా కనిపించేలా చూసుకుంటారు చాలా మంది.

    మెహిందీ, నెయిల్ పాలిష్ లతో అందంగా కనిపిస్తాయి కదా. వీటితో ప్రయోజనం, అందం మాత్రమే కాదు ఇవి కూడా మీ ఆరోగ్యాన్ని తెలుపుతాయి అంటే మీరు నమ్ముతారా? అవును మీ గోర్లు మీ ఆరోగ్యం గురించి మీకు హింట్ ఇస్తాయి. వాటిని తెలుసుకొని మలుచుకోవడం అవసరం. మీ గోర్లు సౌందర్యం కంటే ఎక్కువ-అవి అంతర్లీన ఆరోగ్య సమస్యలను సూచించేవిగా ఉన్నాయి కాబట్టి వాటిని ఎలా గుర్తు పట్టాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

    చాలా మందికి నెయిల్స్ పెళుసుగా ఉంటాయి. ఇలా ఉండటానికి ప్రధానం కారణం ఇనుము లోపం లేదా నిర్జలీకరణ సమస్య అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా ఉన్నప్పుడు ఐరన్ లోపం అని గుర్తించి తగిన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఐరన్ లోపం వల్ల సమస్యలు పెరుగుతాయి జాగ్రత్త. ముఖ్యంగా గర్భిణిలకు మరింత ఎక్కువ సమస్యగా నిలుస్తుంది. ఇక కొందరికి పసుపు రంగు నెయిల్స్ ఉంటాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్లు లేదా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఇలాంటి నెయిల్స్ కనిపిస్తాయి.

    గోర్ల మీద చాలా మందికి తెల్లని మచ్చలు కనిపిస్తుంటాయి. చిన్నప్పుడు ఇలా ఉంటే కొంగ పని అని సరదాగా ఆడుకునే వారు కదా. కానీ ఇలా గోర్ల మీద తెల్లని మచ్చలు ఉంటే జింక్ లేదా కాల్షియం లోపం అంటున్నారు నిపుణులు. కొంగ మీద అబాండాలు వేయకుండా జింక్, కాల్షియం ఉండే ఆహారాలను తీసుకోండి. గోర్ల మీద గట్ల ఆకారాలను గమనించారా? కొందరికి నిలువు పంక్తులు సాధారణం. కానీ అడ్డంగా ఉన్నవి అనారోగ్యాన్ని సూచిస్తాయి. ఇక లేలేత నెయిల్స్ కూడా మీ అనారోగ్యాన్ని సూచిస్తాయి. ఇవి రక్తహీనత లేదా పేద రక్త ప్రసరణను సూచించవచ్చు.

    నీలి రంగు నెయిల్స్ ఉన్నా సరే కాస్త జాగ్రత్త పడాలి. తక్కువ ఆక్సిజన్ స్థాయిలు లేదా ఊపిరితిత్తుల సమస్యలను సూచిస్తాయి ఈ నెయిల్స్. క్లబ్బింగ్ అదేనండి కొందరికి గోర్లు వంగినట్టు ఉంటాయి. ఇలా ఉంటే గుండె లేదా ఊపిరితిత్తుల పరిస్థితులను సూచిస్తున్నట్టు ఆ నెయిల్స్.