Bathukamma Festival In America : బతుకమ్మ పండుగ వచ్చింది. తెలంగాణ ఆడపడుచులు ఏడాదంతా ఎదురు చూసే పండుగ. పుట్టింటికి చేరుకుని తొమ్మిది రోజులు సంబురంగా చేసుకునే ఉత్సవం. తీరొక్క పూలతో పతుకమ్మలు పేర్చి.. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి.. తమను చల్లగా చూడాలని పూలను కొలిచే వేడుక. బతుకమ్మ పండుగ తెలంగాణ పల్లె ప్రజల జీవితంలోభాగం. బుతుకు చిత్రాన్ని ఆవిష్కరించే వేడుక. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ పండుగకు తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత అధికారిక హోదా దక్కింది. అధికారిక పండుగగా గుర్తింపు లభించించింది. దీంతో చిన్న పెద్ద అంతా బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. తొమ్మిది రోజులపాటు పల్లె, పట్టణం ఉయ్యాల పాటలతో మార్మోగుతుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మన పండుగకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగువారు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. విదేశాల్లో ఉంటున్న తెలుగు వారు కూడా ప్రాంతీయ భేదాలు మర్చిపోయి వేడుకలు చేసుకుంటున్నారు.
అమెరికా రాష్ట్రాలో ఘనంగా..
ఇక అగ్రరాజ్యం అమెరికాలో కూడా తెలంగాణ బతుకమ్మ పాటలు మార్మోగుతున్నాయి. తెలుగువారు ఎక్కువగా నివసించే నార్త్ కరోలినా, జార్జియా, వర్జీనియా వంటి అనేక రాష్ట్రాలు, షార్లెట్,. రాలీ వంటి నగరాలు ప్రత్యేక బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారు. తెలంగాణ వారసత్వ ప్రకటించడం ద్వారా అక్కడి రాష్ట్రాలు కూడా ధికారికంగా బతుకమ్మను గుర్తించాయి. సంప్రదాయకంగా స్త్రీలు ఆచరించే ఈ పండుగలో క్లిష్టమైన పూల అలంకరణలు, జానపద పాటలు పాడటం సంప్రదాయ నృత్యాలు చేయడం వంటివి ఉంటాయి. అమెరికాలో బతుకమ్మకు అధికారిక గుర్తింపు లభించడం విదేశాల్లో తెలుగు వారి ఉనికి, గుర్తింపు, గౌరవాన్ని పెంచుతుంది.
అనుబంధాల వారథి..
ఇక బతుకమ్మ పండుగ అనుబంధాల వారధిగా మారుతోంది. భావి తరాలకు సంప్రదాయాలు, వారసత్వాలను తెలియజేస్తుంది. ఏ దేశంలో ఉన్నా.. మన సంస్కృతిని మర్చిపోవద్దు అన్న భావనను బలపరుస్తోంది. అమెరికన్ రాష్ట్రాలు మరియు నగరాల ప్రకటనలు ప్రపంచ స్థాయిలో తెలంగాణ గొప్ప వారసత్వాన్ని సంరక్షించడం ద్వారా భారతీయ ప్రవాసులు, వారి మాతృభూమి మధ్య లోతైన సంబంధాలను పెంపొందించడం అమెరికా బహుళ సంస్కృతినికి నిదర్శనంగా నిలుస్తోంది.