MG Windsor: వండర్ ఫుల్ రికార్డు సృష్టించిన ‘విండర్స్’.. ఒక్కరోజులోనే రికార్డు సేల్స్..

ఆటోమోబైల్ మార్కెట్లో ఎంజీ మోటార్స్ కార్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీని నుంచి రిలీజ్ అయిన కామెట్ ఈవీ, జెడ్ ఎస్ ఈవీల హవా సాగుతున్నాయి. ఈ తరుణంలో ఎంజీ నుంచి విండర్స్ అనే మోడల్ మార్కెట్లోకి వచ్చింది. అక్టోబర్ 3న దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చారు.

Written By: Srinivas, Updated On : October 7, 2024 12:50 pm

mg windsor ev

Follow us on

MG Windsor: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల హవా పెరిగిపోతుంది. వినియోగదారులు ఎక్కువగా వీటినే కోరుకోవడంతో చాలా కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అయితే ఇటీవల ఎంజీ మోటార్స్ కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చిన ఈవీ కోసం ఎగబడుతున్నారు. దీనిని తీసుకొచ్చిన ఒక్కరోజులోనే 15వేల బుకింగ్స్ అయ్యాయి. అయితే ఇప్పటి వరకు టాటా కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ కార్ల హవా జోరు సాగింది. ఇప్పుడీ కంపెనీకి చెందిన విండర్స్ ఈవీ మార్కెట్లోకి రావడంతో వాటి అమ్మకాలకు అడ్డుకట్ట వేసిటన్లయింది. అంతేకాకుండా ఈవీల అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. ఇంతకీ దీని సేల్స్ ఎలాగున్నాయంటే?

ఆటోమోబైల్ మార్కెట్లో ఎంజీ మోటార్స్ కార్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీని నుంచి రిలీజ్ అయిన కామెట్ ఈవీ, జెడ్ ఎస్ ఈవీల హవా సాగుతున్నాయి. ఈ తరుణంలో ఎంజీ నుంచి విండర్స్ అనే మోడల్ మార్కెట్లోకి వచ్చింది. అక్టోబర్ 3న దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చారు. వచ్చీ రాగానే రికార్డుల మోత మోగించింది. ఒక్కరోజులోనే 15,176 విక్రయాలు జరుపుకొని వండర్ సృష్టించింది. భారతదేశంలో ఈవీల అమ్మకాల్లో విండర్ మాత్రమే ఈ స్థాయిలో అమ్మకాలు సొంతం చేసుకుంది.

ఎంజీ మోటార్స్ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ఎక్సైట్, ఎక్స్ క్లూజివ్, ఎఉసెన్స్ ఉన్నాయి. అలాగే స్టార్ బర్డ్స్ బ్లాక్, పెర్ల్ వైట్, క్లే బీజ్, టర్కోయిస్ అనే కలర్లలో లభిస్తుంది. కొత్త ఎంజీ విండర్స్ లో 38 కిలో వాట్ల లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 15 గంటల్లో పూర్తి ఛార్జింగ్ అవుతుంది. 136 పీఎస్ శక్తిని, 200 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేసే ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 330 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అయితే 7.4 కిలోవాట్ ఛార్జర్ ఉపయోగించడం వల్ల తక్కువ సమయంలోనే 80 శాతం ఛార్జింగ్ చేసుకోవచ్చు.

విండర్స్ ఫీచర్స్ అద్భుతంగా ఉన్నాయని చాలా మంది కొనియాడుతున్నారు. ఇందులో ఎల్ ఈడీ లైట్ బార్, ఎల్ ఈడీ హెడ్ లైట్స్, ఉన్నాయి. 18 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఆకర్షిస్తాయి. ఇన్నర్ లో 15.6 అంగుళాల ప్లోటింగ్ టచ్ స్క్రీన్, కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్ వంటివి ఆకర్షిస్తాయి. అలాగే యాంబియంట్ లైటింగ్, స్టీరింగ్ వీల్ కు మీడియా కంట్రోల్స్ ఉన్నాయి.

ఎంజీ విండర్స్ కొత్త ఈవీలో సేప్టీ ఫీచర్స్ అదనపు భద్రతను ఇస్తాయి. ఇందులో 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్ట్ వంటివి ఉన్నాయి. ఈ కారును బుక్ చేసుకోవాలంటే రూ. 11,000 టోకెన్ తో తీసుకోవచ్చు. ప్రస్తుతం ఎంజీ మోటార్స్ ను రూ. 13. 50 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. అయితే బ్యాటరీ మార్పు కోరుకునేవారికి రూ. 9. 99 లక్షలకే అందిస్తున్నారు. కొత్తగా ఈవీని కొనుగోలు చేయాలనుకునే వారికి కొత్త విండర్స్ ఆకర్షిస్తోంది.. అని చర్చించుకుంటున్నారు