https://oktelugu.com/

Salaar 2: సలార్ 2 మీద మాట మార్చిన ప్రశాంత్ నీల్…ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..!

కన్నడ సినిమా ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక అప్పటినుంచి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో తనతో సినిమా చేయాలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు...

Written By:
  • Neelambaram
  • , Updated On : October 7, 2024 / 12:59 PM IST
    Follow us on

    Salaar 2: కేజిఎఫ్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ప్రశాంత్ నీల్ ఆ తర్వాత ప్రభాస్ తో చేసిన ‘సలార్ ‘ సినిమాతో ఒక్కసారిగా తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకునే పనిలో ఉన్నాడు. నిజానికి సలార్ సినిమాతో ఒక్కసారిగా ఇండియన్ మార్కెట్ ని షేక్ చేశాడు. ఈ సినిమాతో దాదాపు 800 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టి కమర్షియల్ సినిమాలకు కొత్త అర్ధాన్ని చెప్పాడు. మరి ఇలాంటి ప్రశాంత్ సలార్ 2 సినిమా ఎప్పుడు చేస్తున్నాడు. అనే దానిమీద ప్రభాస్ అభిమానులు తీవ్రమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే గతంలో తొందర్లోనే సలార్ 2 స్టార్ట్ చేస్తానని చెప్పిన ప్రశాంత్ నీల్ ఆ తర్వాత ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమాని అనౌన్స్ చేశాడు. మరి ఈ సినిమా పూర్తి అయిన తర్వాత సలార్ 2 సినిమాని తెరకెక్కిస్తాడా అంటే అది కూడా క్లారిటీగా చెప్పడం లేదు. ఎందుకంటే ఈ సినిమా తర్వాత ఆయన కేజిఎఫ్ 3 సినిమాని తెరకెక్కించాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి సలార్ 2 మీద ఎందుకు ప్రశాంత్ నీల్ ఇలాంటి నిర్లక్ష్యం వహిస్తున్నాడు అంటూ ప్రభాస్ అభిమానులు ఇప్పుడు ప్రశాంత్ నీల్ పైన ట్రోలింగ్ అదే చేస్తున్నారు.

    ఇక మొత్తానికి అయితే ప్రశాంత్ నీల్ వీలైతే సలార్ 2 తొందరగా చేస్తానని చెప్పినప్పటికీ ప్రభాస్ అభిమానులు మాత్రం మాకు నమ్మకం లేదు దొర అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం డ్రాగన్ సినిమా మీదనే తన పూర్తి ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది.

    ఈ సినిమాని సక్సెస్ చేసి రెండు వేల కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టాలనే లక్ష్యంతోనే తను ముందుకు దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇలాంటి సందర్భంలో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కు మైండ్ బ్లాక్ అయిపోయే హిట్ ఇస్తానని మాట కూడా ఇచ్చారట. మరి దానికి తగ్గట్టుగానే వీళ్ళిద్దరూ కలిసి కష్టపడి ఈ ప్రాజెక్టుని భారీ సక్సెస్ ఫుల్ సినిమాగా నిలిపాలని చూస్తున్నారు.

    ఇక ఇప్పటికే స్టోరీ కూడా అద్భుతంగా వచ్చిందని తద్వారా సినిమాను అనుకున్న విధంగా తెరకెక్కిస్తే మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు సాధించడమే కాకుండా ఇండస్ట్రి హిట్టు కూడా కొడుతుందని ప్రశాంత్ నీల్ తన కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే మాత్రం ఇక ప్రశాంత్ నీల్ స్టార్ డైరెక్టర్ల లిస్టులో నెంబర్ వన్ పొజిషన్ కు వెళ్లిపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…