Northern Turkey : ఉన్నత చదువులు చదివారు.. ఉన్నతంగా ఉద్యోగాలు చేస్తున్నారు. అధునాతనమైన జీవితాన్ని గడుపుతున్నారు. అంతకుమించి అనే రేంజ్ లో సౌకర్యాలు అనుభవిస్తున్నారు. అయినప్పటికీ తోటి మనిషితో వారు మాట్లాడరు. కనీసం భావాలు కూడా వ్యక్తం చేసుకోరు. అదే ఇప్పటియుగంలో ఇలాంటివారు ఎలా జీవిస్తున్నారు అనే ప్రశ్న మీలో వ్యక్తం కావచ్చు. అయితే వారు మాటలతో సంబంధం లేకుండా.. భావాలతో సంబంధం లేకుండా బతుకుతున్నారు. తమ జీవితాన్ని కేవలం విజిల్స్ ద్వారా మాత్రమే సాగిస్తున్నారు. చదువుతుంటే కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. ఇది ముమ్మాటికి నిజం..
ఇప్పుడంటే తుర్కయే ప్రాంతం మనకు శత్రువు అయిపోయింది. ఉగ్రవాద దేశంతో అంట కాగి మన హిట్ లిస్టులో చేరిపోయింది.. ఈ దేశంలో కుష్ కోయి అనే పర్వత ప్రాంతం ఉంది. ఈ గ్రామంలోని ప్రజలు కేవలం ఈలలు వేసుకుంటూ మాత్రమే మాట్లాడుతుంటారు. పక్షుల్లాగా శబ్దాలు చేస్తుంటారు. ఆ శబ్దల ద్వారానే వారిని వారు కమ్యూనిటీగా చేసుకుంటారు. ఒక రెండు పిలవడానికి లేదా రమ్మనడానికి మాత్రమే కాకుండా.. మనం మాట్లాడే ప్రతి పదాన్ని కూడా వీళ్లు రకరకాల శబ్దాల్లోకి మార్చేస్తుంటారు. దాదాపు 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ భాషకు వారు మీ పరితమైన ప్రాధాన్యమిస్తున్నారు. కాకపోతే వారు వుంటున్నది అటవీ ప్రాంతం కాబట్టి.. ఎంత గట్టిగా మాట్లాడినా శబ్దం ఎక్కువ దూరం వినిపించదు.
శబ్దం దూరం వినిపించదు కాబట్టి.. విజిల్ సౌండ్ ఎంత దూరమైనా వెళుతుందని భావించి అందుకే ఈలలో కొన్ని మార్పులతో ఏకంగా ఒక భాషను సృష్టించారు. దానిని విజయవంతంగా ఉపయోగిస్తున్నారు. ఈ భాషను ఐక్యరాజ్యసమితి అంగీకరించింది. అంతేకాదు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది..అయితే స్మార్ట్ ఫోన్ల వల్ల ఈ భాషను ఈ తరం వాళ్లు నేర్చుకోవడం లేదు. నేర్చుకోవాలని పెద్దవాళ్ళు చూపించినప్పటికీ మీరు అంతగా ఆసక్తి చూపించడం లేదు. వయసు మీద పడుతున్న నేపథ్యంలో భాష వచ్చినవారు సైతం విజిల్స్ వేయడానికి ఇష్టం చూపించడం లేదు. అయితే తమ భాషను బతికించుకోవడానికి వీలు ప్రతి ఏడాది బర్డ్ లాంగ్వేజ్ ఫెస్టివల్ నిర్వహిస్తుంటారు. ఈ ఫెస్టివల్ లో కొత్త కొత్త పదాలను కనిపెడుతుంటారు. ఉన్న పదాలకు సరికొత్త నగీషీలు అద్దుతుంటారు. చివరికి భాష అభివృద్ధి విషయంలో ఎంతో కృషి చేయాలని ప్రతిజ్ఞ చేస్తుంటారు. అయితే అది కూడా విజిల్స్ రూపం లోనే పూర్తి చేస్తుంటారు. మొత్తంగా తమ సంస్కృతిని కాపాడుకోవడానికి వీరు విపరీతమైన కృషి చేస్తుంటారు. అయితే తన భాషను మరుగున పడకుండా చూసుకోవడానికి వీరు పడుతున్న కష్టం మామూలుగా లేదు. అయితే ఇక్కడి ప్రభుత్వం నుంచి భాషా పరిరక్షణకు సంబంధించి హామీ లభించిందని… భాష విషయంలో సహకారం అందజేస్తామని ప్రభుత్వ పెద్దలు భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది.
Used by around 10,000 people today, this 400-year-old whistled ‘bird language’ of Northern Turkey has just been added to UNESCO’s list of endangered languages pic.twitter.com/okraJz30x3
— TRT World (@trtworld) December 10, 2017