Chinese Employee : ఉద్యోగం అంటే వారానికి 5 రోజులు చేయాల్సిన డ్యూటీ. ప్రభుత్వ శాఖల్లో అయితే సెలవులు ఉంటాయి. ప్రైవేటు సెక్టార్‌లో సెలువలు కావాలంటే బాస్ కరుణించాలి. చాలా మందికి అవసరానికి సెలవులు దొరకవు. అయితే చైనాకు చెందిన ఓ ఉద్యోగి మాత్రం చాలా లక్కీ. అతనికి ఏడాదంతా సెలవులు దొరికాయి.
చైనాలోని షెంజెన్ నగరంలో ఓ ఉద్యోగి అసాధారణ బహుమతిని సొంతం చేసుకున్నాడు. 365 రోజుల పూర్తి వేతనంతో సెలవులు. సాధారణంగా కార్యాలయాల్లో ఒకటి రెండు రోజుల సెలవులే లభిస్తాయి, కానీ ఈ అదృష్టవంతుడు ఏడాదంతా విశ్రాంతిని ఆస్వాదించనున్నాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, దీనికి సంబంధించిన వీడియో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది.
Also Read : అమెరికాపై విరుచుకుపడిన టోర్నడోలు.. భారీగా ఆస్తి ప్రాణ నష్టం
కంపెనీ ప్రత్యేక బహుమతి విధానం..
షెంజెన్‌లోని ఓ ప్రముఖ టెక్ కంపెనీ ఏటా తమ ఉద్యోగుల కృషిని గుర్తిస్తూ వార్షిక సమావేశం నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి ఇంక్రిమెంట్లు, విదేశీ పర్యటనలు, పదోన్నతులు వంటి ప్రోత్సాహకాలు అందిస్తుంది. అయితే, ఈ ఏడాది ఓ అద్భుతమైన బహుమతిని ప్రవేశపెట్టింది ‘గ్రాండ్ సర్ర్‌పైజ్’గా ఒక ఉద్యోగికి సంవత్సరం పొడవునా సెలవులు, అదీ పూర్తి వేతనంతో! ఈ బహుమతిని లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేస్తారు, ఇది ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది.
అదృష్ట జాతకుడు..
2025 సమావేశంలో చెన్ అనే ఉద్యోగి ఈ అరుదైన బహుమతిని గెలుచుకున్నాడు. సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్న చెన్, తన అద్భుత పనితీరుతో కంపెనీలో గుర్తింపు పొందాడు. లక్కీ డిప్‌లో అతని పేరు ఎంపిక కావడంతో, సహోద్యోగుల ఆనంద హర్షారావాల మధ్య ఈ బహుమతిని అందుకున్నాడు. ఈ కార్యక్రమాన్ని వీడియోలో రికార్డ్ చేసి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వీబోలో పోస్ట్ చేయడంతో, ఇది వైరల్‌గా మారి మిలియన్ల వ్యూస్ సాధించింది.
సోషల్ మీడియాలో సంచలనం
ఈ వీడియోలో చెన్ ఆనందంతో బహుమతిని అందుకుంటున్న దృశ్యాలు, సహోద్యోగుల ఉత్సాహం నెటిజన్లను ఆకర్షించాయి. ‘‘ఇలాంటి బహుమతి ఎవరైనా కలలోనైనా ఊహిస్తారా?’’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించగా, మరొకరు ‘‘ఇలాంటి కంపెనీలో ఉద్యోగం చేయడం నిజంగా అదృష్టం’’ అని పేర్కొన్నారు. ఈ బహుమతి చైనాలోని కార్మిక సంస్కృతిపై చర్చను రేకెత్తించింది, ఎందుకంటే షెంజెన్ వంటి నగరాలు తీవ్రమైన పని ఒత్తిడికి ప్రసిద్ధి చెందాయి.
కంపెనీ వ్యూహం.. ఉద్యోగుల ప్రేరణ
ఈ కంపెనీ ఈ వినూత్న బహుమతి విధానం ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంచడానికి, వారి సృజనాత్మకతను ప్రోత్సహించడానికి రూపొందించబడింది. షెంజెన్‌లోని టెక్ రంగంలో తీవ్రమైన పోటీ మధ్య, ఇలాంటి ప్రోత్సాహకాలు ఉద్యోగుల లాయల్టీని, ఉత్పాదకతను పెంచుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కంపెనీ ప్రతినిధి ఒకరు, ‘‘మా ఉద్యోగులు మా విజయానికి మూలస్తంభాలు. వారి కషిని గుర్తించడం మా బాధ్యత’’ అని తెలిపారు.