Sleeping : మనిషికి నిద్ర చాలా అవసరం. కంటి నిండా నిద్రపోయేవారు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అయితే నేటి కాలంలో రకరకాల ఒత్తిడి వల్ల సరైన నిద్ర పోలేకపోతున్నారు. కొందరు ఉద్యోగం లేదా వ్యాపారం వలన రాత్రిల్లో లేటుగా నిద్రిస్తూ.. ఉదయం ఆలస్యంగా లేస్తున్నారు. ఇలా నిద్ర గడియారం సరిగా లేకపోవడంతో అనేక అనారోగ్యాలు వెంటాడుతున్నాయి. అంతేకాకుండా కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. కొందరు నిద్రపోయినప్పుడు వారి గొంతులో ఎక్కువగా తడారుతుంది. దీంతో పదే పదే దాహం అవుతుంది. అయితే ఇలా కావడానికి కారణమేంటి? దాని పరిష్కారము ఏంటి?
Also Read : అరటి పండ్లు, పాలు కలిపి తాగుతున్నారా?
నిద్రపోయిన తర్వాత కొంతమందికి మధ్యలో మెలకువ వచ్చి దాహం వేస్తుంది. దీంతో కిచెన్ రూమ్ లోకి వెళ్లి వాటర్ తాగి వచ్చి మళ్లీ నిద్రిస్తారు. మరికొందరు అక్కడికి వెళ్లే ఓపిక లేకపోవడంతో పడుకున్న చోటే వాటర్ బాటిల్ ఉంచుకొని దాహం వేసినప్పుడు తాగుతూ ఉంటారు. అయితే ఇలా నీటిని నిత్యం తీసుకున్న కూడా కొందరికి గొంతు ఎప్పటికీ ఆరిపోతూ ఉంటుంది. ఎక్కువగా నీళ్లు తాగాలని అనిపిస్తుంది. దీనికి కారణం ఆటో ఇమ్యూన్ డిజాస్టర్ అని అంటారు. మార్కెట్లలో లభించే ఆహారం తో పాటు నీళ్లు కూడా కల్తీగా మారాయి. అందువల్ల బయట ఎక్కడ ఏమి తినకుండా ఇంట్లోకి వచ్చి ఆహారాన్ని తీసుకున్న వారి సంతృప్తిగా ఉంటారు.
అయితే ఇలా సక్రమంగా ఆహారం తీసుకుంటున్న వారి గొంతులో తడి ఆరుతుంది. దీంతో తమకు ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అనుకుంటూ ఉంటారు. అయితే అదే పదే నీరు తాగాలని అనిపించడం.. గొంతు తడి ఆరడం వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యంగా ఉండదు. ఈ లక్షణాల వల్ల శరీరం ఆందోళనకరంగా ఉంటుంది.
అయితే ఈ పరిస్థితి ఉన్నవారు ఎక్కువగా నీరు తాగడం మంచిది. అలాగే ఆల్కహాల్ లేదా ఇతర ప్రాసెస్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్న ఇలా మధ్య మధ్యలో మీరు తాగాల్సిన అవసరం వస్తుంది. అంతేకాకుండా నోట్లో లాలాజలం ఎక్కువగా ఉండాలంటే వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తినాలి. అలాగే అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా ఉండాలి. ముఖ్యంగా వేసవికాలంలో ఈ జాగ్రత్తలు తీసుకొని ఉండాలి.
ప్రాసెస్ ఫుడ్ తీసుకున్న కూడా ఎక్కువగా దాహం వేస్తుంది. అయితే ఒక్కోసారి దాహం తీరడానికి ఎక్కువగా నీరు తీసుకుంటాం. కానీ ఇలా అతిగా నీరు తీసుకోవడం కూడా ప్రమాదమే అని నిపుణులు తెలుపుతున్నారు. అందువల్ల వేసవిలో ఎక్కువగా నీరు తీసుకుంటూ ఉండాలి.