https://oktelugu.com/

No River: ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ఎందుకో మీకు తెలుసా?

ప్రపంచ దేశాల్లో సౌదీ అరేబియాలో ఒక్క నది కూడా ఉండదు. కనీసం ఒక సరస్సు కూడా ఈ దేశంలో ఉండదు. ప్రపంచంలోని అతిపెద్ద దేశాల్లో ఈ సౌదీ అరేబియా ఒకటి. అతిపెద్ద ఎడారి దేశాల్లో కూడా సౌదీ అరేబియా ఒకటి. అసలు ఇక్కడ వర్షాలే పడవు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 10, 2024 / 09:39 PM IST

    NO River

    Follow us on

    No River: సాధారణంగా దేశం అంటే అన్ని ఉంటాయి. ఉదాహరణకు సముద్రాలు, నదులు, సరస్సులు, కొలనులు ఇలా ఒకటేంటి అన్ని రకాలు ఉంటాయి. కానీ ఈ ప్రపంచంలోని ఒక దేశంలో అసలు నదులే ఉండవు. అదేంటి నదులు లేవా? మరి వీరికి జీవనాధారం అయిన నీరు ఎలా అని అనుకుంటున్నారా? మన దేశంలో నదులపై జీవించి ఆధారపడే వాళ్లు చాలా మంది ఉన్నారు. ఈ నదుల నుంచి వచ్చిన స్వచ్ఛమైన నీటితో పూర్వకాలంలో ఎక్కువగా వంటలు చేసుకునే వారు. ఇప్పటి జనరేషన్‌లో అయితే కొండ ప్రాంతాల్లో ఉండేవారు ఈ నదుల నుంచి వచ్చిన నీటితో వంటలు చేస్తారు.

     

    ఇదంతా పక్కన పెడితే అసలు ప్రపంచ దేశాల్లో సౌదీ అరేబియాలో ఒక్క నది కూడా ఉండదు. కనీసం ఒక సరస్సు కూడా ఈ దేశంలో ఉండదు. ప్రపంచంలోని అతిపెద్ద దేశాల్లో ఈ సౌదీ అరేబియా ఒకటి. అతిపెద్ద ఎడారి దేశాల్లో కూడా సౌదీ అరేబియా ఒకటి. అసలు ఇక్కడ వర్షాలే పడవు. వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. ఏడాది మొత్తానికి ఒకటి నుంచి రెండు సార్లు మాత్రమే వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి. అదే ఇండియాలో అయితే వర్షాలు లేకపోతే అసలు ఉండలేరు. ముఖ్యంగా వ్యవసాయానికి అయితే తప్పకుండా వర్షాలు కురవాలి. లేకపోతే పంటలు పండించాలంటే చాలా కష్టం అవుతుంది.

     

    సాధారణంగా ఇండియాలో ఏదైనా అవసరానికి నీరు లేకపోతేనే చాలా ఖర్చు అవుతుంది. అలాంటిది పూర్తిగా వర్షాలు ఉండవు, నదులు లేవు మరి నీరు ఎక్కడి నుంచి వస్తుందని అనుకుంటున్నారా? సౌదీ అరేబియా నీటి కోసం చాలా ఖర్చు చేస్తుంది. ఆ దేశ జీడీపీలో సౌదీ అరేబియా రెండు శాతం నీటికి ఖర్చు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఎక్కువగా భూగర్భ జలాలపై సౌదీ ఆధారపడి ఉంది. ఇప్పటికి అక్కడ కొందరు భూగర్భ జలాలను ఉపయోగిస్తారు. అయిన ఈ నీరు సరిపోవు. అందుకే నీటి కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. అయితే సౌదీ అరేబియా చుట్టూ సముద్రాలు మాత్రం ఉన్నాయి.

     

    సాధారణంగా సముద్రపు నీరు ఉప్పుగా ఉంటాయి. వీటిని అసలు తాగలేరు. కానీ సౌదీ అరేబియా ఈ నీటిని తాగడానికి అయ్యేలా తయారు చేస్తున్నారు. కాకపోతే ఉప్పు నీటిని మంచిగా మార్చడానికి చాలా ఖర్చు అవుతుంది. సౌదీ అరేబియా వేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ నీటి కొరత సమస్య మాత్రం తగ్గడం లేదు. అయితే ఇటీవల సౌదీ అరేబియాలో మంచు వర్షం కురిసింది. సాధారణంగా ఇక్కడ విపరీతమైన ఎండలు ఉంటాయి. కానీ గత మూడు రోజుల కిందట భారీ మంచు వర్షం కురిసింది. రోడ్డుపైన తెల్లటిది కప్పటినట్లు మంచు వర్షంతో నిండిపోయింది. అయితే ఈ మంచు వర్షం భారీగా కురవడం అంత మంచిది కాదని నిపుణులు తెలిపారు. ముందు రోజుల్లో తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొవలసి వస్తుందని అధికారులు హెచ్చరించారు.